Director Apsar Next Movies ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త జానర్లు, కొత్త సినిమాలు, యంగ్ దర్శకులకు డిమాండ్ పెరిగింది. కొత్త కొత్త కంటెంట్‌లను తెర మీదకు తీసుకొస్తున్నారు. థియేటర్, ఓటీటీ, సినిమాలు, వెబ్ సిరీస్‌లంటూ చాలా రకాల ఫ్లాట్‌ ఫాంలు లభ్యం అవుతుండటంతో.. ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు అందుతున్నాయి. అయితే ఇప్పుడు గంధర్వ సినిమా దర్శకుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. గత ఏడాది గంధర్వ సినిమాతో డైరెక్టర్ అప్సర్ తన ప్రతిభను చాటుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతాన్ని మర్చిపోవడం, మళ్లీ గతం కోసం ప్రయత్నించడం అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన గంధర్వ ఆడియెన్స్‌ అందరినీ ఆకట్టుకుంది. తొలి ప్రయత్నంలోనే వినూత్నమైన కథాంశం యాంటి ఏజింగ్‌ని ఎంచుకొని సాహసమే చేసాడు దర్శకుడు అప్సర్ . ఈ సినిమా దర్శకుడు ఇప్పుడు కొత్త సినిమాలను ప్రారంభించాడు.


గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఓటీటీలోనూ ఈ చిత్రం దూసుకుపోతోంది. తెలుగు తమిళ భాషల్లో విశేషాదరణను దక్కించుకుంది. ఓటీటీలో ఈ సినిమా రికార్డ్ వ్యూస్‌తో  దుమ్ములేపేస్తోంది. ఇక ఇప్పుడు అప్సర్ తన కొత్త సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్దంగా ఉన్నాడు. మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, కొత్త పాయింట్‌తో పెద్ద నిర్మాణ సంస్థతో మరో ప్రాజెక్ట్‌ను సెట్ చేసుకున్నాడు. ఈ నెలాఖరున సెట్స్ మీదికి వెళ్ళనుందని, త్వరలోనే మిగిలిన వివరాలు తెలియజేస్తామని అన్నాడు.


Also Read:  Malli Pelli Teaser : మళ్లీ పెళ్లి టీజర్.. నరేష్-రమ్య రఘుపతి-పవిత్రల కథే సినిమానా?.. హోటల్ సీన్ కేక


ఇక రెండో ప్రాజెక్ట్ ఇలా లైన్‌లో ఉండగానే.. మూడో చిత్రాన్ని కూడా ఓకే చేయించుకున్నారని సమాచారం. బడా ప్రొడక్షన్ హౌస్‌తో మరో క్రేజీ కాంబో కూడా పట్టాలెక్కించనున్నాడట. ఇప్పటికే తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్న అప్సర్.. ఇలా వరుస సినిమాలతో బిజీగా కానున్నాడు. ఇప్పటి వరకు ఎవరు ఊహించని మరో రెండు కథలతో త్వరలోనే మన ముందుకు రానున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.


Also Read: Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook