యాంగ్రీ యంగ్ మేన్ డాక్టర్ రాజశేఖర్ నటించిన లేటెస్ట్ సినిమా "గరుడవేగ". విడుదలకు ముందే భారీ అంచనాలను పెంచుకున్న ఈ చిత్రం, విడుదల అయ్యాక కూడా మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలు మనం కూడా తెలుసుకుందాం..!


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ఈ సినిమా బడ్జెట్ దాదాపు 25 కోట్లు. ఇంత బడ్జెట్‌లో అంత మంచి క్వాలిటీతో సినిమా తీయడం దర్శకుడి ప్రతిభే అంటున్నారు విమర్శకులు


  • గరుడవేగ సినిమా షూటింగ్ దాదాపు ఒక నెల జార్జియో దేశంలో జరిగింది. భీకర వాతావరణ పరిస్థితులలో కనిపించే నేచురాలిటీ కోసం దర్శకుడు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అయితే అలాంటి వాతావరణంలో షూటింగ్ జరపడం కోసం అక్కడ ప్రభుత్వం నుండి స్పెషల్‌గా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది.


  • ఈ సినిమా కోసం స్టంట్స్ టీమ్ ఎంతగానో కష్టపడింది. దేశం కాని దేశంలో హోటల్స్‌కు దూరంగా ఉన్న ప్రాంతాల్లో 33 రోజుల పాటు బస చేసి పోరాట సన్నివేశాలను చిత్రీకరించారట. 


  • ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్లుగా నలుగురు వ్యవహరించారు. అందులో అంజి, సురేష్ రఘుతు, శ్యామ్ ముగ్గురు కాగా, గికా అనే ఫ్రెంచి సినిమాటోగ్రఫర్ కూడా పనిచేశారు. 


  • ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఎం.కోటేశ్వరరాజు, మురళీ శ్రీనివాస్‌లకు ఇదే తొలి సినిమా. అయినా ఖర్చుకి వెనుకాడకుండా సినిమా తీయడం విశేషం. 


  • దర్శకుడు ప్రవీణ్ సత్తారు "గరుడవేగ" స్క్రిప్ట్‌ని 2006లో రాశారు. అయితే దాదాపు 11 సంవత్సరాల తర్వాత సినిమా పట్టాలెక్కడం గమనార్హం.


  • గరుడవేగ సినిమా తీయడానికి దాదాపు 93 రోజులు పట్టింది. 


  • సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి ముందే రాజశేఖర్‌కు కొన్ని అనారోగ్య కారణాల వలన గుండెపోటు వచ్చింది. దానితో నెల రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారు. కానీ 10 రోజులకే ఆయన మళ్లీ షూటింగ్‌కి హాజరయ్యారట. 


  • గరుడవేగ సినిమా టీజర్ ఆన్‌లైన్‌లో విడుదల అవ్వగానే దాదాపు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం అదే టీజర్ 8 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది.