Gauri Kishan: తమిళంలో భారీ సక్సెస్ అందుకున్న 96 సినిమాలో స్కూల్ అమ్మాయిగా కనిపించి మనందరిని మెప్పించిన నటి గౌరీ కిషన్. ప్రస్తుతం ఈ హీరోయిన్ కొన్ని సినిమాలలో, వెబ్ సిరీస్ లో కనిపిస్తూ అందరిని మెపిస్తోంది. చిరంజీవి కూతురు సుస్మిత నిర్మించిన శ్రీదేవి శోభ‌న్‌బాబు మూవీలో హీరోయిన్‌గా న‌టించింది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా చేసిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ లిటిల్ మిస్ నైనా ETV విన్‌లోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ మధ్యనే 90’s వెబ్ సిరీస్ తో సూపర్ హిట్ అందుకున్న ఈటీవీ విన్.. ఇప్పుడు ఈ లిటిల్ మిస్ నైనా తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
నూతన దర్శకుడు విష్ణు దేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో ఇందులో షేర్షా షెరీఫ్ మెయిన్ లీడ్‌గా నటించారు. ఇందులో హీరోయిన్ నైనా పొట్టిగా (4 అడుగులు), హీరో అభిజిత్ పొడవుగా (6 అడుగులు) ఉండటంతో పొట్టి, పొడుగు కాన్సెప్ట్‌తో అందరినీ నవ్వించేలా ఈ చిత్రాన్ని  తీర్చిదిద్దారు దర్శకుడు.


ఓ యువ‌తి ప్రేమ‌క‌థ‌కు ఎత్తు ఎలాంటి స‌మ‌స్య‌గా మారింద‌నే కాన్సెప్ట్‌తో లిటిల్ మిస్ రాథ‌ర్ పేరుతో మ‌ల‌యాళంలో విడుద‌లైన ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని పొందింది. ఇందులో గౌరి జీ కిష‌న్ యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు కూడా ద‌క్కాయి. ఇప్పుడు ఇదే స్టోరీని తెలుగులో తీశారు విష్ణు దేవ్.


అంతేకాకుండా ఈ సినిమాకి 96 ఫేమ్ గోవింద్ వసంత అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ల్యూక్ జోస్ కెమెరా, సంగీత్ ప్రతాప్ ఎడిటింగ్, సుతిన్ సుగతన్ నిర్మాతగా వ్యవహరించారు. 


జనవరి 25 నుంచి ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ETV విన్‌లో ప్రసారం మొదలైంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీ ప్రియమైన వారితో కలిసి దీన్ని చూడండి.


Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?


Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook