Super Star Mahesh Babu wish his Son Gautham: 'సూపర్ స్టార్' కృష్ణ వారసుడిగా మహేష్ బాబు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. కృష్ణ వారసుడు అనే ట్యాగ్ ఉన్నా.. మహేష్ తన నటనతో ఎక్కోమెట్టు ఎక్కారు. తండ్రికి తగ్గ తనయుడుగా పేరు గడించారు. అంతేకాదు తండ్రిలా 'సూపర్ స్టార్' హోదాను సంపాదించుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ అగ్ర హీరోలలో మహేష్ ఒకరిగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబుకు ఓ రేంజ్‌లో ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన పేరు చెపితేనే ఊగిపోయే ఫాన్స్ ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'రాజకుమారుడు' సినిమా ద్వారా మహేష్ బాబు వెండితెరకు హీరోగా పరిచయం అయ్యారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'మురారి' సినిమా మహేశ్‌కు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. గుణశేఖర్‌ డైరెక్షన్‌లో వచ్చిన 'ఒక్కడు' బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో మహేశ్ వెనుతిరిగి చూసుకోలేదు. అతడు, పోకిరి, బిజినెస్ మ్యాన్, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట లాంటి హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. 


'వంశీ' సినిమాలో హీరోయిన్‌గా నటించిన నమ్రతా శిరోద్కర్‌ను మహేష్ బాబు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. మహేశ్‌, నమ్రతాకు ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు గౌతమ్, కూతరు పేరు సితార. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. మహేష్ కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. ఏడాదిలో రెండు సార్లు కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళతారు. కొడుకు గౌతమ్, కూతరు సితార అంటే మహేశ్‌కు చాలా ఇష్టం. నేడు గౌతమ్ 16వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేష్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. 



'నా యంగ్‌మ్యాన్‌ గౌతమ్‌కు 16వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రతిరోజూ నువ్వు నన్ను గర్వపడేలా చేస్తున్నావు. నువ్వు జీవితంలో ఉత్తమమైన వ్యక్తిగా ఎదగడం  కోసం ఎదురుచూస్తున్నా. జీవితంలో నీకు అంతా మంచే జరగాలని నా ప్రేమ మరియు ఆశీర్వాదాలు ఇస్తున్నా. గుర్తుంచుకో.. నీకు అవసరమైన ప్రతిసారీ నేను నీ వెన్నంటే ఉంటా. లవ్ యూ మై సన్.. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా' అని మహేశ్‌ బాబు ట్వీట్ చేశారు.


Also Read: IND vs HK: హాంకాంగ్‌తో భారత్ మ్యాచ్‌.. కేఎల్ రాహుల్ ఔట్! టీమిండియా తుది జట్టు ఇదే


Also Read: Gold Price Today: పండగ పూట స్వల్పంగా పెరిగిన పసిడి ధర... ఎంత పెరిగిందంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి