Genelia DSouza reacts to being called besharam cheap vulgar aunty on Arbaaz Khans Pinch: సినిమా ఇండస్ట్రీ వారు ఏం చేసినా ఈజీగా వైరల్‌ అవుతూ ఉంటుంది. సినీ స్టార్ట్స్ (Cine Stars) చాలాసార్లు ట్రోల్‌కి కూడా గురవతుంటారు. ఇదంతా సెలబ్రిటీలకు కామన్. అయితే కొందరు స్టార్స్‌ ట్రోలింగ్‌ను (trolling) సీరియస్‌గా తీసుకుంటారు. కొందరేమో ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోరు. బాలీవుడ్‌లో ఈ ట్రోలింగ్ మోతాదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇటీవల బీ టౌన్‌ జంట నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్, (riteish deshmukh) నటి జెనీలియా డిసౌజా (Genelia DSouza) విషయంలోనూ ఇలాగే జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నటుడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) హోస్ట్‌ చేస్తున్న షో.. పించ్‌కు (Pinch) తాజాగా రితేశ్‌, (riteish) జెనీలియా (Genelia) జంట అతిథులుగా హాజరయ్యారు. షోలో భాగంగా సెలబ్రిటీలు ట్రోల్‌కి సంబంధించిన కామెంట్స్‌ని చదివి వారి రెస్పాన్స్‌ తెలుసుకుంటూ ఉంటాడు అర్బాజ్. అలాగే ఈ జంటను కూడా ఓ వైరల్ వీడియోపై, అలాగే దానిపై వచ్చిన ఒక కామెంట్‌పై అడిగారు అర్బాజ్.


Also Read : LIVE Suicide Attempt:వేగంగా వస్తున్న రైలు..పట్టాలపై నిలుచున్న యువతి..ఏం జరిగింది??


అసలు ఆ వీడియో ఏమిటి.. ఆ కామెంట్ ఏమిటో ఒకసారి చూద్దాం.. గతంలో నటి ప్రీతి జింటాని రితేశ్‌ చేతులపై ముద్దు పెట్టకోగా, జెనీలియా (Genelia) జలసీతో చూస్తూ ఉంటుంది ఆ వీడియోలో. అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత జెనీలియా కోపంతో తన భర్త రితేశ్‌ను కొడుతున్నట్లు, ఆయన వద్దు వద్దు అని వేడుకుంటున్నట్లు ఉంటుంది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. 



 


అయితే ఈ వీడియోని చూసిన ఓ నెటిజన్‌ ‘సిగ్గు లేదా, వల్గర్‌ ఆంటీ. ఎప్పుడూ ఓవర్‌ యాక్టింగ్ చేస్తుంటావ్‌. ఇది నీ ముఖానికి సెట్‌ అవ్వదు’ అంటూ కామెంట్‌ పెట్టాడు. ఈ కామెంట్ గురించే అర్బాజ్ (Arbaaz Khan).. జెనీలియాను అడగగా.. ‘అతని ఇంట్లో పరిస్థితులు బాలేనట్లు ఉన్నాయి అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. భాయ్ సాబ్, మీరు ఇంట్లో బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను’ అంటూ ఘాటుగా స్పందించింది జెనీలియా(Genelia). ఇక దీనిపై రితేశ్‌ స్పందిస్తూ పాపులారిటీ ఉన్నవాళ్లకి ఇలాంటి విమర్శలు మామూలేనని, వాటి గురించి పట్టించుకోకూడదన్నాడు.



Also Read : Chinese troops: 55 గుర్రాలపై ఉత్తరాఖండ్‌లోకి దూసుకొచ్చిన చైనా సైనికులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook