Get Up Srinu Re-entry in Extra Jabardasth: గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్ ముగ్గురూ జబర్దస్త్ లో మంచి ఫేమస్ అయ్యారు. ముందు నుంచి స్నేహితులో లేక జబర్దస్త్ లోకి వచ్చాక స్నేహితులయ్యారో తెలియదు కానీ ఈ ముగ్గురు కలిసి చేసిన స్కిట్ ఏదైనా సూపర్ హిట్ అవ్వాల్సిందే. అలా ముగ్గురిలో తొలుత గెటప్ శ్రీను సినిమా అవకాశాలు వస్తున్నాయని చెబుతూ జబర్దస్త్ దూరమయ్యాడు. అయినా సరే సుడిగాలి సుధీర్ చాలా కాలం పాటు ఆటో రాంప్రసాద్ తో కలిసి ట్రావెల్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సుడిగాలి సుధీర్ కూడా ఇప్పుడు వేరే ఛానల్ లో వచ్చిన ప్రోగ్రాం ఆఫర్లకు టెంప్ట్ అయ్యాడో లేక జబర్దస్త్ వదిలి వెళ్లాల్సిన టైం వచ్చిందని అనుకున్నాడో తెలియదు గానీ మొత్తానికి సుడిగాలి సుధీర్ కూడా బయటకు వెళ్లిపోయాడు. అయితే అనూహ్యంగా ఇప్పుడు జబర్దస్త్ లోకి గెటప్ శ్రీను ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి ఎంటర్ ఇచ్చారు. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ప్రస్తుతం రాంప్రసాద్ ఒక టీంకి లీడర్ గా వ్యవహరిస్తున్నారు.


ఆ టీమ్ స్కిట్ జరుగుతూ ఉండగా జబర్దస్త్ సెట్టులోకి వచ్చిన గెటప్ శ్రీను అందరితో పాటు ఆటో రాంప్రసాద్ కి కూడా షాక్ ఇచ్చాడు. తాను స్కిట్ చేయాలి అనుకున్నట్లు చెప్పగానే ఆటో రాంప్రసాద్ వెంటనే ఈ స్కిట్ ఇక్కడితో ఆపేస్తున్నా, రాంప్రసాద్ గెటప్ శ్రీను కలిసి స్కిట్ చేస్తారని చెప్పడంతో దానికి ఇంద్రజ కూడా ఒప్పుకున్నారు. దీంతో వెంటనే బయటకు వెళ్లిన గెటప్ శీను మళ్ళీ బిల్డప్ బాబాయ్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఆసక్తికరంగా మారింది అదేమిటంటే కిరాక్ ఆర్పి జబర్దస్త్ ను దూషించిన సమయంలో జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు తెరమీదకు వచ్చాడు.


ఆ సమయంలో గెటప్ శ్రీనుకి తాను కారు ఇచ్చానంటూ ఆయన ప్రచారం చేసిన నేపథ్యంలో అసలు బిల్డప్ బాబాయ్ అనే క్యారెక్టర్ అతన్ని చూసే రాసుకున్నానంటూ గెటప్ శ్రీను తన సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు అదే గెటప్ శ్రీను మళ్ళీ బిల్డప్ బాబాయ్ అంటూ హడావిడి చేయడం చూస్తే ఇది ఏడుకొండలకి కౌంటర్ ఇవ్వడం కోసమే జరిగిందా లేక నిజంగానే వెనక్కి వచ్చేశాడా అనే అనుమానాలు కూడా తెర మీదకు వస్తున్నాయి చూడాలి మరి ఏమి జరగనుంది అనేది. 


Read Also: Ravi Kishan: బన్నీ విలన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు..ఎరక్క పోయి ఇరుక్కుపోయి


Read Also: Liger: మైండ్ బ్లాకయ్యేలా లైగర్ ఓటీటీ-శాటిలైట్ డీల్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.