విక్టరీ వెంకటేష్ 60వ బర్త్ డే సందర్భంగా కొద్దిసేపటి క్రితమే నారప్ప సినిమా నుంచి టీజర్ తరహాలో ఓ చిన్న వీడియోను విడుదల చేశారు నారప్ప మేకర్స్. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తోన్న నారప్ప మూవీలోంచి పలు యాక్షన్స్ సీక్వెన్స్‌ని ఈ వీడియో ద్వారా విడుదల చేశారు. నారప్పగా నటించిన వెంకటేష్ ఎంత ఎమోషనల్, అగ్రెసివ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న నారప్ప సినిమాపై వెంకీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


ప్రముఖ తమిళ చిత్ర నిర్మాత కళైపులి ఎస్ థానుతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగిన ప్రతీకార ఇతివృత్తంతో తెరకెక్కుతోంది. తమిళంలో మంజు వారియర్ పోషించిన పాత్రలో తెలుగు రీమేక్‌లో ప్రియమణి నటిస్తోంది. తెలుగు ఆడియెన్స్ మెచ్చిన ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.