Chiru and Pawan visit Each Other Film Sets: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రిలీజ్‌కి ఇంకా ఒక్కరోజు గడువే ఉండటంతో పవన్ ఫ్యాన్స్‌లో ఎగ్జయిటింగ్ పీక్స్‌కి చేరుతోంది. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఫ్యాన్స్ అంతా టికెట్ల వేటలో నిమగ్నమయ్యారు. అటు మెగా ఫ్యామిలీ కోసం భీమ్లా నాయక్ మేకర్స్ ఇప్పటికే స్పెషల్ షోని ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా అంతా భీమ్లా నాయక్ టాపికే ట్రెండ్ అవుతున్న వేళ.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'గాడ్ ఫాదర్', 'భీమ్లా నాయక్' ఇటీవల ఈ ఇద్దరూ ఒకరి మూవీ సెట్స్‌లో మరొకరు సందడి చేసినట్లు రాంచరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు #BheemlaNayakOn25thFeb అనే హాష్ ట్యాగ్‌ని జోడించారు. చెర్రీ షేర్ చేసిన ఆ వీడియోలో.. మొదట చిరు పవన్ భీమ్లా నాయక్‌ సెట్స్‌లో సందడి చేయడం గమనించవచ్చు. ఆ తర్వాత పవన్ చిరు 'గాడ్ ఫాదర్' సెట్‌లో సందడి చేశారు. ఇందులో చిరు '786' నంబర్‌తో కూడిన ఖైదీ డ్రెస్‌లో కనిపించగా.. పవన్ కల్యాణ్ పోలీస్ డ్రెస్, పంచె లుక్స్‌లో కనిపించారు.


మరో విశేషమేంటంటే.. పవన్ గాడ్ ఫాదర్ సెట్స్‌లో అడుగుపెట్టినప్పుడు నటుడు, దర్శకుడు నారాయణమూర్తి కూడా అక్కడే ఉన్నారు. పవన్, మూర్తి ఒకరికొకరు నమస్కరించుకున్నారు. ట్విట్టర్‌లో రాంచరణ్ పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 2 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.


కాగా, ప్రస్తుతం చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్‌' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ 'లూసిఫర్‌'కి రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఇటు పవన్ కల్యాణ్ మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పన్ కోషియమ్' రీమేక్ 'భీమ్లా నాయక్‌'తో రేపు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాకి భారీ హైప్‌ను తీసుకొచ్చింది. దీంతో పవన్‌-రానా యాక్షన్‌ని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 



Also Read: EC recognition to YSRTP: ఎట్టకేలకు వైఎస్సార్‌టీపీకి ఎన్నికల సంఘం గుర్తింపు.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook