God Father Hero Chiranjeevi Reply about Pawan Kalyan in Salman Khan Role: మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ  సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. గాడ్ ఫాదర్ మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చిరంజీవితో ముచ్చటించారు. ఈ సందర్భంగా చిరు పలు విషయాలు పంచుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు అని పూరీ జగన్నాథ్‌ అడగ్గా.. 'ప్రస్తుత నాయకుల్లో అయితే ఎవరూ లేరు. లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వారిద్దరి హయాంలో దేశం మంచి పురోగతి సాధించింది' అని మెగాస్టార్‌ చిరంజీవి చెప్పారు. సినిమా ఎంపికలో దేనికి ప్రాధాన్యత ఇస్తారు అని ప్రశ్నించగా.. 'కథ నా మొదటి ప్రాధాన్య. కథ నా మనసుకు నచ్చితే సినిమా చేస్తాను. దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే పరాజయం పొందే అవకాశం తక్కువ. పాటలు, ఫైట్లు, గ్లామర్ సినిమాకు హెల్ప్ అవుతాయి' అని చెప్పారు. 


సల్మాన్‌ ఖాన్‌ను తొలిసారి ఎప్పుడు కలిశారు అని చిరంజీవిని పూరీ అడగ్గా... 'ఓ యాడ్ చిత్రీకరణ సమయంలో బ్యాంకాక్‌లో కలిశా. ఆ యాడ్‌ తెలుగులో నేను చేస్తే, హిందీలో సల్మాన్‌ చేశాడు. అప్పటినుంచి మా మధ్య  మంచి అనుబంధం ఉంది. నాకు సోదరుడు. సల్మాన్‌కు రామ్‌ చరణ్‌ అంటే చాలా ఇష్టం. తాను హైదరాబాద్‌ వచ్చినా.. చరణ్‌ ముంబై వెళ్లిన కలుసుకుంటారు. ఈ సినిమాలో నటించినందుకు సల్మాన్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు'అని జవాబిచ్చారు. 


'గాడ్ ఫాదర్ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తే బాగుండేదని చాలామంది అనుకున్నారు నిజమే. సల్మాన్‌ ఖాన్ చేసిన పాత్రలో పవన్‌ నటిస్తే బాగుండేది. ఈ సినిమాలో నటించమని అడిగితే.. కల్యాణ్‌ కాదనేవాడు కాదేమో. ఆ పాత్రను సల్మాన్‌ చేస్తేనే బాగుంటుందని మేము అడగలేదు. ఇతర భాషల్లో కూడా విడుదల చేసే ఆలోచన ఉండటం వల్ల సల్మాన్‌ను తీసుకున్నాం' అని పూరీ అడిగిన ప్రశ్నకు మెగాస్టార్‌ సమాధానం చెప్పారు. 


Also Read: Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ప్రేమికులకు కలిసొచ్చే కాలం!


Also Read: Flipkart Sale: బోట్, వన్‌ప్లస్, రియల్‌మి, ఒప్పో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లపై డిస్కౌంట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook