Good luck sakhi movie on OTT:  కీర్తిసురేష్, ఆది పినిశెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'గుడ్‌ల‌క్ స‌ఖి' (Good Luck Sakhi).  స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు న‌గేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వం వహించారు.  ఈ మూవీని దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో 'రాత్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్' ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై సుధీర్ చంద్ర, శ్రావ్య‌వ‌ర్మ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా చిరంతన్ దాస్ పనిచేశారు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్ బాధ్యతలు నిర్హవించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం... జ‌న‌వ‌రి 28న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించినా.. 'పెంగ్విన్‌', 'మిస్‌ ఇండియా' చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 'గుడ్‌ల‌క్ స‌ఖి' మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది కీర్తి. మరి ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు (Jagapathi Babu), రమాప్రభ, రాహుల్ రామకృష్ణ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. తాజాగా ఈ చిత్రాన్ని  ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో (Amazon Prime) విడుదల చేశారు. తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ లో  ఈ మూవీ అందుబాటులో ఉంది. 


Also Read: Bhamakalapam review: ట్విస్టులతో 'భామా కలాపం'- ఫుల్ మూవీ రివ్యూ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook