Guntur KaaramTrailer Update: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.  ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ఆడియెన్స్ లో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. మహేష్ ఫ్యాన్స్ ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చేసింది. తాజాగా ట్రైలర్ గురించి సాలిడ్ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ (Guntur Kaaram trailer) ను నేడే (జనవరి 07) రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి సడన్ గా సర్ ప్రైజ్ చేసింది మూవీ టీం. ఏం టైంకి రిలీజ్ చేస్తారనే విషయం మాత్రం రివీల్ చేయలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ఫ్లాన్ చేయాలని భావించారు మేకర్స్. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో భద్రతా కారణాల వల్ల మూవీని వాయిదా వేయాల్సి వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పడు సడన్ గా ట్రైలర్ లాంచ్ డేట్ ప్రకటించి అభిమానులనుకు ట్రీట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమాను ఓవర్సీస్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఒక్క 5 వేలకు పైగా ప్రీమియర్షోలు వేయనున్నారు. ఇప్పటి వరకు యూఎస్ఏలో అత్యధిక ప్రీమియర్ షోలు ప్రదర్శితం అయిన సినిమాగా ఆర్ఆర్ఆర్(5408 షోలు) రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా దాని రికార్డును గుంటూరు కారం బద్దలుకొట్టే అవకాశం ఉంది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 



Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి


Also Read: Guntur Kaaram Update: 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ర‌ద్దు.. కారణం ఇదే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి