Vijay Devarakonda: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిన హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమాకు అడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఈ మూవీ యూత్ ను ఆకట్టుకుంది. ఇందులో విజయ్ యాక్టింగ్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తర్వాత విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ లోనూ విజయ్ పేరు మార్మోగిపోయింది. అతడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి కాంబో మరోసారి రిపీట్ కాబోతుందని తెలుస్తోంది. తాజాగా  మైత్రీ మూవీస్ అధినేత ర‌విశంక‌ర్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూర్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా నేడు అంటే సెప్టెంబరు 01న విడుదల కానుంది. ఇందులో విజయ్ కు జోడిగా స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోంది. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి మంచి చిత్రాలు తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. మలయాళ హిట్ 'హృదయం' ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహెబ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇవాళ రిలీజైన ఈ సినిమాకు పబ్లిక్ నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ మూవీ చూసిన అడియెన్స్ ట్విట్టర్లో సూపర్ హిట్ అని కామెంట్స్ పెడుతున్నారు. 


Also Read: Jawan Trailer Review in Telugu: ఎంతో ఎదురుచూసిన ' జవాన్ మూవీ ట్రైలర్ ' ఎలా ఉందంటే...


రీసెంట్ గా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న  మైత్రీ మూవీస్ అధినేత ర‌విశంక‌ర్ విజయ్ నెక్స్ట్ సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్ వంగా కాంబోలో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అదిరిపోయే కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: Kushi Twitter Review: ఖుషి మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి