Bheemla Nayak: పవర్​స్టార్​ పవన్ కల్యాణ్​ ఫ్యాన్స్​కు పండగల చేసుకునే టైమ్ వచ్చేసింది. ఎందుకంటే పవర్​ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ మూవీ విడుదల తేదీని ఫిక్స్​ చేసింది చిత్ర యూనిట్​.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నెల 25న థియేటర్లలో భీమ్లా నాయక్ సినిమాను విడుదల చేయనున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థలో ఒకటైన సితారా ఎంటర్​టైన్మెంట్స్​ ట్విట్టర్​లో ఓ పోస్ట్ పెట్టింది.


పవర్​ ప్రభంజనం థియేటర్లను తాకేందుకు తేదీ ఫిక్స్ అయ్యిందంటూ రాసుకొచ్చింది.



భీమ్లా నాయక్ సినిమా గురించి..


మలయాళం మూవీ అయ్యప్పనుమ్​ కోషియం సినిమాకు ఇది రీమేక్​. మాతృకలో పృథ్విరాజ్​ సుకుమారన్​, బిజు మీనన్​ ప్రధాన పాత్రదారులు. తెలుగులో పవన్​ కల్యాణ్​, రాణా దగ్గుబాటి మెయిన్ రోల్స్ చేశారు.


ఇక ఈ సినిమాలో నిత్యామీనన్​, సంయుక్త మేనన్​లు హీరోయిన్లుగా నటించారు.


బ్రహ్మానందం, మురళీ శర్మా, రఘు బాబు, నర్ర శీను సహా పలువురు ఈ సినిమాలో నటించారు.


సాగర్​ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్​ శ్రీనివాస్​ స్క్రీన్​ప్లే అందించారు. ఎస్​. థమన్​ సంగీతమందించారు. ఇప్పటికే సినిమా పాటలు ఫ్యాన్స్​ను ఉర్రూతలూగిస్తున్నాయి.


ఈ సినిమాను సితార ఎంటర్​టైన్మెంట్స్​, హారిక & హాసిని క్రియేషన్స్​ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, ఎస్​.రాధా కృష్ణ నిర్మించారు.


Also read: Bigg Boss Nonstop: బిగ్ బాస్ ఓటీటీ ప్రోమో రిలీజ్... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..!


Also read: Shraddha Das Photos: మోడ్రన్ డ్రస్సులో అలరిస్తున్న అల్లు అర్జున్ హీరోయిన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook