Bigg Boss 6 Telugu Winner బిగ్ బాస్ ఆరో సీజన్ అంత చెత్త సీజన్ ఇంకోటి లేదని, వరెస్ట్ కంటెస్టెంట్లను ఎంపిక చేశారంటూ జనాలు తిట్టేస్తున్న విషయం తెలిసిందే. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా కొంత మంది కంటెస్టెంట్లు చివరకు జనాల వరకు రీచ్ అయ్యారు. కొంత మంది నెగెటివ్ ఇమేజ్‌తో రీచ్ అయితే.. ఇంకొంత మంది పాజిటివ్ ఇమేజ్‌తో జనాల ఆదరణను దక్కించుకున్నారు. టాప్ 5 వరకు ఉండగలిగే సత్తా ఉన్న కంటెస్టెంట్లు తమ తమ స్వయంకృపారాధాలతో బయటకు వచ్చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందులో ముందుగా గీతూ ఉంటుంది. విన్నర్ లేదా రన్నర్ అవ్వాల్సిన కాండిడేట్ తన అతి చేష్టలు, ఓవర్ కాన్ఫిడెంట్, నోటి దూలతో, తానే గొప్ప, తానే తోపు అన్న భ్రమల్లో ఉండటంతో బయటకు వచ్చేసింది. ఇక బాలాదిత్య సైతం టాప్ 5 కంటెస్టెంట్ అవ్వగలిగినవాడే. కానీ అతని ఎలిమినేషన్‌కు సరైన కారణాలు చెప్పలేం. కర్ణుడి చావుకు వంద కారణాలంటారు.. కానీ బాలాదిత్య ఎలిమినేషన్‌కు ఒక్క సరైన కారణం తెలియడం లేదు.


ఇక ఫైమా కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్. కానీ తన అతి, వెటకారంతో వెనక్కి రావాల్సి వచ్చింది. ఇక సత్య అయితే అదృష్టం కొద్దీ ఉండిపోయింది. ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్‌లో సత్య ఉంది. మొత్తానికి మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ సత్యను లేపి అవతల పారేసినట్టు కనిపిస్తోంది. రేవంత్, రోహిత్, ఆదిరెడ్డి, శ్రీహాన్‌లు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు. కీర్తి ఇక్కడి వరకు ఎలా వచ్చిందా? అని ఆశ్చర్యపోయే ఆడియెన్స్ కూడా ఉన్నారు.


ఇక బిగ్ బాస్ టైటిల్‌కు పోటీ పడే అర్హత మాత్రం రేవంత్, శ్రీహాన్‌లకు ఎక్కువగా ఉందని అంతా భావిస్తుంటారు. శ్రీహాన్ తన నిబ్బా చేష్టలతో కొంత వెనక్కి వచ్చాడు. రేవంత్ తన నోటి దురుసుతో విన్నింగ్‌కు కాస్త అడుగు దూరంలో ఉండిపోయేలా ఉన్నాడు. కామెన్ మెన్ కెటగిరీలో వచ్చిన ఆదిరెడ్డి ఇక్కడ వస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఆదిరెడ్డిలోని ముక్కుసూటిదనం, నిజాలు మాట్లాడటం, నిజాయితీగా ఉండటం, వెన్ను పోట్లు తెలియకపోవడం అతని ప్లస్ అయితే.. అందరి గురించి రివ్యూలు చేయడం, బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లా కాకుండా ఆడియెన్‌లాను ఉండటం అతని మైనస్.


అయితే ఈ సీజన్‌లో మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరా? అని అంటే మాత్రం అది కచ్చితంగా రోహిత్ అవుతాడు. మెరినా ఉన్నంత వరకు రోహిత్ ఆట కనిపించలేదు. కానీ ఆమె బయటకు వెళ్లాక రోహిత్ మరింత స్ట్రాంగ్ అయ్యాడు. ఇప్పుడు గూగుల్ కూడా చెబుతున్నది అదే. రోహిత్‌ ఈ సీజన్ విన్నర్ అని అంటోంది గూగుల్. మరి నిజంగానే ఇది రియాల్టీలో జరుగుతుందా? రోహిత్ గెలుస్తాడా? రేవంత్ ఓటింగ్‌ ప్రవాహంలో రోహిత్ గెలిచి నిలబడతాడా? అన్నది చూడాలి.


Also Read : Jabardasth Anchor Sowmya : యాంకర్ రష్మీకే ఎసరు పెట్టేసింది.. దుమ్ములేపేసిన జబర్దస్త్ యాంకర్ సౌమ్య


Also Read : Atlee wife Priya Pregnancy : తండ్రి కాబోతోన్న డైరెక్టర్ అట్లీ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook