Gopichand and tamannas Seetimaarr Movie on OTT: ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సినిమాలు థియేటర్లలో అసలు రిలీజ్ కావడం లేదు. కొన్ని మూవీలు రిలీజ్‌ అవుతున్నా.. మళ్లీ వాటిని కొన్ని రోజులకే ఓటీటీ వేదికల్లో రిలీజ్‌ చేస్తున్నారు. ఇక తాజాగా రిలీజై ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘సీటీమార్‌’ (Seetimaarr). కబడ్డీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. త్వరలో ఓటీటీలో గోపీచంద్‌ (Gopichand) ‘సీటీమార్‌’ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోపీచంద్‌, తమన్నా (tamanna) ప్రధాన పాత్రల్లో సంపత్‌ నంది దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా (kabaddi coach) గోపీచంద్‌ ..తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్‌గా తమన్నా వ్యవహరించారు. ఇక భూమిక (Bhumika) కీలక పాత్ర పోషించారు.


Also Read : RBI Good News:ఆర్‌బీఐ కీలక ప్రకటన.. త్వరలో ప్రారంభంకానున్న ఆఫ్‌లైన్‌ డిజిటల్ సేవలు


కార్తీక్ స్పోర్ట్స్ కోటాలో (sports quota) బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. క‌డియంలో త‌న తండ్రి స్థాపించిన రామ‌కృష్ణ మెమోరియ‌ల్ స్కూల్ మూత‌ప‌డే ప‌రిస్థితి వచ్చిన టైమ్‌లో దాంతో ఎలాగైనా తాను తీర్చిదిద్దిన కబ‌డ్డీ జ‌ట్టుని జాతీయ స్థాయి పోటీల్లో గెలిపించి, ఆ జ‌ట్టు ద్వారా ఊళ్లోని స్కూల్ స‌మస్య వెలుగులోకి తీసుకురావాల‌నకుంటాడు హీరో (Hero). ఆ ప్రయ‌త్నంలో కార్తీక్‌కి ఎలాంటి అడ్డంకులు ఎదుర‌వుతాయి.. ఢిల్లీలో పోలీస్ (police) అధికారిగా ఉద్యోగం చేస్తూనే మాఫియాని న‌డిపిస్తున్న మాకన్‌సింగ్ (త‌రుణ్ అరోరా) తో హీరోకు ఎలా వైరం ఏర్పడింది అనేది మూవీలో (movie) ట్విస్ట్. అలాగే కార్తీక్ జ‌ట్టు జాతీయ స్థాయి పోటీల్లో విజేత‌గా నిలిచిందా లేదా కార్తీక్ ఆశ‌యం నెర‌వేరిందా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


Also Read : Konda Polam Movie Review: వైష్ణ‌వ్‌తేజ్ నటించిన 'కొండ పొలం' సినిమా రివ్యూ


ఇక ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో (OTT) రిలీజ్‌ కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో అక్టోబరు 15 నుంచి సీటీమార్‌ (Seetimaarr) మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు మూవీ యూనిట్ ఒక కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook