Mokshagna Phone number : మోక్షజ్ఞ నంబర్ తీసుకున్న గోపీచంద్ మలినేని.. వీడియో వైరల్.. సినిమా ఫిక్స్?

Nandamuri Balakrishna Son Mokshagna నందమూరి బాలకృష్ణ తనయుడిగా మోక్షజ్ఞకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులంతా కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
Mokshagna Phone number నందమూరి తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమం గురవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మందే హాజరయ్యారు. ఇక వీర సింహా రెడ్డి సినిమాతో నందమూరి ఫ్యామిలీకి దగ్గరయ్యాడు గోపీచంద్ మలినేని. తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమంలో గోపీచంద్ మలినేని కనిపించాడు. మోక్షజ్ఞ సైతం మెరిశాడు.
తారకరత్న పెద్ద కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్‌ను బాలయ్య ఇగ్నోర్ చేశాడని, పట్టించుకోవడం లేదని, ఎన్టీఆర్‌కు ఏంటి ఈ కర్మ, ఇంకా ఎందుకు దూరంగా పెడుతున్నారు.. అంటూ ఇలా ఎన్టీఆర్ అభిమానులు ఎమోషనల్ అయ్యారు.
ఇక ఇప్పుడు మరో విజువల్ వైరల్ అవుతోంది. ఇందులో మోక్షజ్ఞ నంబర్‌ను గోపీచంద్ మలినేని అడిగి మరీ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇక మోక్షజ్ఞ సైతం గోపీచంద్ మలినేని నంబర్‌ను తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియోను చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ ఇద్దరూ నంబర్లు ఎక్స్ చేంజ్ చేసుకున్నారంటే.. కచ్చితంగా ఈ కాంబోలో సినిమా సెట్ అయ్యేలానే ఉంది అంటూ అభిమానులు సంబరపడుతున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇప్పటికే ఎన్నెన్నో రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆదిత్య 369 సీక్వెల్‌గా రాబోతోన్న ఆదిత్య 999 అనే సినిమా కథను బాలయ్య రాసుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతోనే మోక్షజ్ఞను తెరపైకి తీసుకు రావాలని అనుకుంటున్నట్టుగా బాలయ్య ఇది వరకే ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. కానీ ఇంత వరకు ఆ ప్రాజెక్ట్ అడుగు కూడా ముందుకు పడలేదు. మరి గోపీచంద్ మలినేని ప్రయత్నాలు చేస్తే అవి వర్కౌట్ అవుతాయా? లేదా?అన్నది చూడాలి.
Also Read: Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook