Gopichand Rama Banam Poster గొపీచంద్, శ్రీవాస్ కాంబోలో ఇది వరకు లక్ష్యం, లౌక్యం అనే సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు మూడో చిత్రం రాబోతోంది. ఇక ఈ హ్యాట్రిక్ సినిమాకు నందమూరి బాలకృష్ణ టైటిల్‌ను పెట్టేశాడు. ఆహా అన్ స్టాపబుల్ షోలో గోపీచంద్ వచ్చినప్పుడు బాలయ్య ఓ టైటిల్‌ను సూచించాడు. దాంతో బాలయ్య సూచించినట్టుగానే రామబాణం అనే టైటిల్‌ను గోపీచంద్ ఫిక్స్ చేసుకున్నాడు. మహా శివరాత్రి సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


రామబాణం అనే ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. గోపీచంద్‌కు జంటగా డింపుల్ హయతి కనిపించనుంది. జగపతి బాబు, కుష్బూ కీ రోల్స్ పోషించారు. ఈ సినిమాలో గోపీచంద్ విక్కీ అనే రోల్‌ను పోషించాడు. 


మహా శివరాత్రి కానుకగా శనివారం సాయంత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. విక్కీస్ ఫస్ట్ యారో అనే పేరుతో విడుదల ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. కథానాయకుడిది రామబాణంలా దూసుకుపోయే స్వభావమని తెలిపేలా చేతికి బాణం లాకెట్ ధరించి అదిరిపోయే యాక్షన్‌తో గోపీచంద్ ఎంట్రీ ఇచ్చాడు. 


అయితే ఇది పూర్తిగా యాక్షన్ ఫిల్మ్ కాదని, తమ గత చిత్రాల తరహాలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని తెలిపేలా కొసమెరుపుతో ముగించారు. చిన్నోడా అనే వాయిస్ రాగానే కథానాయకుడు సౌమ్యంగా అమృత నిలయంలోకి ప్రవేశించడం ఆకట్టుకుంది. ఇక ఇందులో మిక్కీ జే మేయర్ అందించిన నేపథ్య సంగీతం అందరినీ ఆకట్టుకుంటోంది.


ఈ సినిమాకి కథని భూపతి రాజా అందించగా, ఛాయాగ్రహకుడుగా వెట్రి పళని స్వామి పని చేస్తున్నారు. ఈ సినిమాను 2023 సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే గోపీచంద్‌కు వరుసగా ఫ్లాపులే ఎదురవుతున్న ఈ తరుణంలో రామబాణం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.


Also Read:  vinaro bhagyamu vishnu katha Review : వినరో భాగ్యము విష్ణు కథ రివ్యూ.. కిరణ్ అబ్బవరం పాస్ అయ్యాడోచ్


Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook