Gopichand Ramabanam Release Date హీరోగా గోపీచంద్‌కు మంచి క్రేజ్ ఉంది. కెరీర్ ప్రారంభంలో హీరోగా, విలన్‌గా మంచి సినిమాలనే ఎంచుకున్నాడు. ఇక చివరకు గోపీచంద్ హీరోగానే నిలదొక్కుకున్నాడు. అయితే గోపీచంద్‌కు మాత్రం సరైన హిట్ రావడం లేదు. లౌక్యం చివరి హిట్టుగా కనిపిస్తోంది. చివరగా వచ్చిన సీటీమార్, పక్కా కమర్షియల్ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయాయి. గోపీచంద్‌కు కామెడీ ప్లస్ యాక్షన్ సినిమాలే బాగా కలిసి వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్ష్యం, లౌక్యం సినిమాలు గోపీచంద్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. శ్రీవాస్, గోపీచంద్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలు మంచి విజయాలు దక్కించుకున్నాయి. అయితే గోపీచంద్ శ్రీవాస్ కలిసి హ్యాట్రిక్ సినిమా కోసం రెడీ అయ్యారు. రామబాణం అంటూ ఈ సినిమా మేలో సందడి చేయబోతోంది. మే 5న ఈ చిత్రం రాబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్లో గోపీచంద్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు.


మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, 'విక్కీస్ ఫస్ట్ యారో' అనే ప్రత్యేక వీడియో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు. గోపీచంద్ సరసన ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తోంది.


బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో రామబాణం అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. లక్ష్యం, లౌక్యం తరువాత మళ్లీ కలిసి చేస్తున్నారు కాబట్టి మీ నెక్ట్స్ సినిమాకు రామ బాణం అనే టైటిల్‌ను పెట్టుకోండని బాలయ్య సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య మాటే శాసనంగా గోపీచంద్ సైతం తన సినిమాకు రామబాణం అనే టైటిల్‌ను పెట్టేసుకున్నాడు. సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తున్న ఈ సినిమాతోనైనా గోపీచంద్‌కు సరైన హిట్ వస్తుందా? లేదా? అన్నది చూడాలి.


Also Read:  Priyadarshi Balagam : బలగం ఆమెకే అంకితం.. అమ్మ కాదు అత్తమ్మ.. ప్రియదర్శి ఎమోషనల్ పోస్ట్


Also Read: Shruti Hassan Knee Injury : శ్రుతి హాసన్ మోకాళ్లకు గాయం.. నెటిజన్ల సెటైర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook