Gorre Puranam: టైటిల్ తోనే ఆసక్తి రేకిస్తోన్న సుహాస్ ‘గొర్రె పురాణం’ మూవీ.. సెప్టెంబర్ 20 న విడుదల..
Gorre Puranam: తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నాడు సుహాస్. తాజాగా ఈయన ‘గొర్రె పురాణం’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ టైటిల్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.
Gorre Puranam: మంచి కాన్సెప్ట్ కథలు ఎక్కడున్న వెతికి పట్టుకోవడంలో సుహాస్ ఎపుడు ముందుంటాడు. ‘కలర్ ఫోటో’ చిత్రంతో హీరో గా తన కెరీర్ మొదలు పెట్టి వరుసగా డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో అలరిస్తూనే ఉన్నాడు. అంతేకాదు హీరోగా తొలి సినిమా ఓటీటీ వేదికగా విడుదలైన జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు కైవసం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న విధానం లాంటి వెరైటీ కాన్సెప్ట్ స్టోరీలతో తెలుగు ఆడియన్స్ ను అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా ఇప్పుడు ‘గొర్రె పురాణం’ అనే మరో కొత్త కాన్సెప్ట్ చిత్రం తో ప్రేక్షక దేవుళ్ల ముందకు వస్తున్నాడు. టైటిల్ తోనే సినిమాపై బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం సెప్టెంబర్ 20 న థియేట్రికల్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
ఫోకల్ వెంచర్స్ బ్యానర్ పై సుహాస్ హీరో గా బాబీ దర్శకత్వం లో ప్రవీణ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘గొర్రె పురాణం’ ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 20న విడుదల కాబోతుంది.
ఇది ఒక గొర్రె కథ. ఒక గ్రామంలో హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టిన ఒక గొర్రె కథ. స్టోరీ కాన్సెప్ట్ చాలా వెరైటీగా న్యూ ఏజ్ కథగా ఈ సినిమా సరికొత్తగా ఉంటుంది. మంచి కథ కథనంతో సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుహాస్ మరోసారి ఈ సినిమాలో తన నటనతో మెప్పించడం విశేషం. పవన్ సి హెచ్ స్వరపరిచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. 'భలే భలే' మరియు ఓ రారే రారే లిరికల్ పాటలు విడుదలై గొర్రె పురాణం మూవీ హై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. ఈ సినిమాలో గొర్ర కి దర్శక నటుడైన తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఇప్పటికే సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కాబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.