Guduputani trailer review: గూడుపుఠాణి. ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు వెనుక దాగి ఉండే వ్యూహరచనకు చెప్పుకునే మరోపేరే గూడుపుఠాణి. ఇదే టైటిల్‌తో ప్రముఖ కమెడియన్ సప్తగిరి హీరోగా ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతోంది. సప్తగిరి సరసన నేహా సోలంకి (Neha Solanki) జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ఫేమస్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ రఘు కుంచె తొలిసారిగా విలన్ పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్నాడు. తాజాగా గూడుపుఠాణి సినిమా ట్రైలర్ విడుదలైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సప్తగిరి (Sapthagiri) పేరు వింటేనే అందరికి ముందుగా గుర్తుకొచ్చేది కామెడీనే. కానీ గూడుపుఠాణి ట్రైలర్ చూస్తే.. ఈ సినిమాలో కామెడిని మించి మరేదో ఉందని అనిపించకమానదు. రొమాన్స్, సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్న సినిమా అనే ఫీల్ కలిగేలా గూడుపుఠాణి ట్రైలర్ కట్ చేశారు. అనుకోకుండా రౌడీల పద్మవ్యూహంలో చిక్కుకున్న ఓ యువ జంట వారి బారి నుంచి తప్పుంచుకోవడానికి ఏం చేశారు, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే కథాంశంతో గూడుపుఠాణి మూవీని తెరకెక్కించినట్టు ట్రైలర్ (Guduputani trailer) చూస్తే అర్థమవుతోంది. 



 


నటుడిగా సప్తగిరి ఆడియెన్స్‌కి కొత్త కాకపోయినా.. గూడుపుఠాణి సినిమాలో ఆడియెన్స్‌కి కనిపించే ఓ కొత్త యాంగిల్ రఘు కుంచెలోని విలనిజం. అవును.. రఘు కుంచె పోషించిన విలన్ పాత్ర (Raghu Kunche as villain) ఎంతో కరడుగట్టిన రౌడీని తలపిస్తోంది. కే.ఎం. కుమార్ డైరెక్ట్ చేసిన గూడుపుఠాణి మూవీ (Guduputani movie) అంచనాలను అందుకునేలా ఉందో లేదో తెలియాలంటే... ఈ సినిమా విడుదలయ్యేంత వరకు వేచిచూడాల్సిందే మరి.