Singer Vaishali Bulsara Murder: గుజరాత్‌ ప్రముఖ గాయని వైశాలి బల్సారా మృతదేహం సోమవారం లభ్యం కావడం సంచలనం రేపింది. గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని పార్డి ప్రాంతంలో కారులో గాయని వైశాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్ నది ఒడ్డున కారులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైశాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నివేదిక కోసం తరలించారు. అయితే ఆమె శవం దొరకడానికి 24 గంటల ముందు వైశాలి మిస్సింగ్‌పై ఆమె భర్త ఫిర్యాదు చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు ఆమె మృతదేహం లభ్యం కావడంతో ఆమె కుటుంబసభ్యులు అందరూ విషాదంలో మునిగిపోయారు. వైశాలి బల్సారా వల్సాద్ ప్రాంతంలో ఒక ఫేమస్ సింగర్. పోలీసులు వైశాలి మృతదేహాన్ని ఫోరెన్సిక్ పోస్టుమార్టం నిమిత్తం సూరత్‌కు తరలించారు. ప్రాథమిక విచారణలో లేడీ సింగర్ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వైశాలి బల్సార కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వైశాలి కుటుంబ సభ్యులను, స్నేహితులందరినీ విచారిస్తున్నారు.


అదే సమయంలో, ఆమె ఇంటి నుండి హత్య జరిగినట్టుగా భావిస్తున్న ప్రదేశం వరకు ఉన్న అన్ని రోడ్ల సీసీటీవీ ఫుటేజీ చెక్ చేస్తున్నారు. ఈ హత్య ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు ఎనిమిది వేర్వేరు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైశాలి ఒకరి వద్ద డబ్బులు తీసుకోవాలని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళింది, అయితే రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో భర్త హితేష్ బల్సారా సిటీ పోలీస్ స్టేషన్‌లో తన భార్య మిస్సింగ్‌ గురించి ఫిర్యాదు చేశాడు. హితేష్ - వైశాలి 2011 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.


ఇద్దరికీ ఒక కుమార్తె కూడా ఉంది. హితేష్ బల్సారాకు మొదటి భార్యకు జన్మించిన మరో కుమార్తె కూడా ఉంది. హితేష్- వైశాలి, ఇద్దరు కుమార్తెలు హితేష్ తల్లిదండ్రులతో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అలాగే, వైశాలి కారులో ఎవరిని,  ఎందుకు, కలవడానికి ఇక్కడికి వచ్చిందనేది కూడా ఆరా తీస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలపై పోలీసులకు ఇంకా క్లూ లభించలేదు.


ఈ కేసులో హత్య, డబ్బు లావాదేవీలు, అంతర్గత కలహాలు, అక్రమ సంబంధం వంటి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 31, 2021న, న్యూ ఇయర్ లిక్కర్ పార్టీ కారణంగా, పోలీసులు వైశాలి ఇంటిపై దాడి చేసి, స్నేహితులతో కలిసి తాగిన స్థితిలో ఆమెను పట్టుకున్నారు. గుజరాత్ లో లిక్కర్ బ్యాన్ కావడంతో వారి మీద చర్యలు తీసుకున్నారు. వైశాలి తన భర్తతో కలిసి గుజరాత్ మరియు సమీప నగరాల్లో షోలు చేసేది.


Also Read: Kamal Rashid Khan Judicial Custody: నోటి దురదకు చెల్లించక తప్పదు మూల్యం.. క్రిటిక్ కేఆర్కే అరెస్ట్.. 14 రోజుల జైలు?


Also Read: Anasuya Aunty Controversy: పాపం అనసూయకు వరుస కష్టాలు.. ఆంటీ వివాదంతో మూడు అవకాశాలు గాయబ్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి