Mahesh Babu Workout Photo Viral: మోస్ట్ హ్యాండ్ సమ్ హీరోల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకరు. యాబై పదులకు చేరువవుతున్న ఇంకా 25 ఏళ్ల కుర్రాడిలానే కనిపిస్తాడు మహేశ్. ఈయన తన  గ్లామ‌ర్ ను చాలా బాగా మెయిన్ టైన్ చేస్తారు. ఈయన అందం గురించి పొగడని వారంటూ ఎవరూ ఉండరు. ఎప్పుడు స్లిమ్ గా కనిపించే ఈ హీరో ఇప్పుడు కండలు పెంచే పనిలో పడ్డాడు. దీని కోసం జిమ్ లో తెగ చెమటొడిస్తున్నాడు. దీని సంబంధించిన ఫోటోలను మహేశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అతడు షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రైండ్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజమౌళి మూవీ కోసం మహేశ్ తన మేకోవర్ ను పూర్తిగా చేంజ్ చేసుకునే పనిలో పడ్డాడు. అందుకనే జిమ్ లో తెగ వర్కౌట్ చేస్తున్నాడు. అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా రాబోతున్న రాజమౌళి-మహేశ్ మూవీ ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రానికి టాప్ స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. మరోవైపు మహేశ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.



Also Read: Leo Movie: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోకేశ్ కనగరాజ్, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook