Mahesh Babu - Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అందులో అతడు మూవీ క్లాసిక్‌గా నిలిస్తే.. ఖలేజా మూవీ బిగ్ స్క్రీన్ పై కాకుండా స్మాల్ స్క్రీన్ పై బ్లాక్ బస్టర్ హిట్టైయింది. దీంతో గుంటూరు కారం మూవీపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమాకు మిక్స్‌డ్ సొంతం చేసుకోవడంతో అనుకున్నంత రేంజ్‌లో కలెక్షన్స్ సొంతం చేసుకోలేకపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుంటూరు కారం మూవీకి మొదటి రోజు మహేష్ బాబు ఇమేజ్‌తో పాటు త్రివిక్రమ్ స్టార్ డమ్ వంటివి ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది. ఆ తర్వాత మంచి వసూళ్లనే రాబట్టింది. అంతేకాదు రూ. 90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో నాన్ ప్యాన్ ఇండియా క్యాటగిరిలో హైయ్యెస్ట్ ఫస్ట్ డే వసూళ్లను సాధించిన మూవీగా రికార్డులకు ఎక్కింది. మరోవైపు ఈ సినిమాకు పోటీగా విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం గుంటూరు కారం సినిమాకు పెద్ద దెబ్బగా మారింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ సినిమా దూకుడును  సైతం తట్టుకుంటూ ఓన్లీ మహేష్ బాబు ఇమేజ్ కారణంగా  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ కలెక్షన్స్ నే  రాబట్టింది. మరోవైపు ఈ సినిమాకు ఈ ఫలితం రావడంపై అందరు గురూజీ (త్రివిక్రమ్) వైపు వేలెత్తి చూపెడుతున్నారు.


బడా స్టార్ హీరోను పెట్టుకొని కేవలం సింగిల్ లైన్ పాయింట్ తో ఈ సినిమాను చుట్టేసాడనే చెడ్డ పేరు మాటల మాంత్రికుడికి వచ్చింది. తల్లితో కుమారుడికి ఎలాంటి సంబంధం లేదంటూ ప్రామిసరి నోట్ రాసి ఇవ్వడంపైనే ఈ సినిమా కథను నడింపించాడు గురూజీ. అందులో మహేష్ బాబు మాస్ క్యారెక్టర్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ క్యారెక్టర్‌ను రాసుకున్నాడు మాటల మాంత్రికుడు. అంతేకాదు మహేష్ బాబును కొత్తగా చూపించడంతో పాటు పోకిరి తరహాలో వింటేజ్ లుక్ పై పెట్టిన శ్రద్ధ కథ, కథనాలపై పూర్తిగా కేటాయించ లేకపోయాడు గురూజీ.


ప్రస్తుతం 'గుంటూరు కారం' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇక ఓటీటీ సహా ప్రతి సినిమాపై తన అభిప్రాయాలు కుండబద్దలు కొడుతుంటారు ప్రముఖ రచయత పరుచూరి గోపాలకృష్ణ. తాజాగా ఈయన గుంటూరు కారం సినిమా చూసాకా.. ఈ సినిమాపై తన నిక్కచ్చైన అభిప్రాయాలను వెలిబుచ్చారు.


ఈ సినిమాకు 'గుంటూరు కారం' టైటిల్ పెట్టడమే పెద్ద మైనస్‌గా మారింది. ఇక దర్శకుడిగా త్రివిక్రమ్ రాసుకున్న కథ అద్భుతంగా ఉందన్నారు. తల్లి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను మాస్ సినిమాగా ప్రొజెక్ట్ చేసారు. అదే ఈ సినిమా వాళ్లు చేసిన తప్పు.ఇక రమణగాడి పాత్రలో మహేష్ బాబు ఇరగదీసాడన్నారు. మరోవైపు త్రివిక్రమ్ ఈ సినిమాను ఎమోషనల్‌గా కాకుండా మాస్ ఆడియన్స్ కోరుకునే విధంగా డీల్ చేసాడన్నారు. ఎమోషన్‌ను ఇంకాస్త క్యారీ చేసివుంటే ఈ సినిమా మరో లెవల్లో ఉండేదన్నారు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర నిడివి ఇంకాస్త బాగా రాసుకొని ఉండాల్సింది అన్నారు. ఏది ఏమైనా త్రివిక్రమ్ ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తీర్చిదిద్దారన్నారు. తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేసిన కుచ్చీ మడతపెట్టి లిరికల్ సాంగ్ విడుదలైన నెల రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మరోవైపు ఈ సినిమా ఫుల్ సాంగ్ 2 వారాల్లో 51 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఓవరాల్‌గా 152 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఒక రకంగా ఇది రికార్డు అని చెప్పాలి.


ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్ల విషయానికొస్తే..ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 111 కోట్ల షేర్.. (రూ. 184.5 కోట్ల గ్రాస్) వరకు రాబట్టింది. గుంటూరు కారం  సినిమా థియేట్రికల్‌గా  రూ. 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్డర రూ.21.19 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. ఏది ఏమైనా నెగిటివ్ టాక్‌తో గుంటూరు కారం సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు.


Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే


Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook