Pak Actress Dance for Naatu Naatu: నాటు నాటు సాంగ్ కు పాక్ నటి స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా!
Hania Amir Dance For Naatu Naatu : పాకిస్తాన్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న హనియా అమీర్ తాజాగా నాటు నాటు సాంగ్ కి స్టెప్పులు వేస్తూ అదిరిపోయేలా డాన్స్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంది.
Hania Amir Dance For Naatu Naatu song: ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి అద్భుతాలను సృష్టిస్తున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ముందుగా భారతీయ భాషల్లో మాత్రమే విడుదలైంది. కానీ నెట్ఫ్లిక్స్ లో ఎప్పుడైతే ఇంగ్లీషులో విడుదలైందో అప్పుడు ఈ సినిమాకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ దక్కింది. అనేక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా సినిమాని ప్రమోట్ చేస్తూ ఉండడంతో ప్రపంచ దిగ్గజ దర్శకులైన జేమ్స్ కెమెరూన్, స్టీఫెన్ స్టీల్ బర్గ్ వంటి వారు కూడా సినిమాని ప్రశంసిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా నుంచి కీరవాణి స్వరపరిచిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరిలో ఈ సినిమాని ఆస్కార్ కమిటీ నామినేట్ చేసింది. ఇప్పటికే సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించిన ఈ నాటు నాటు సాంగ్ ఇప్పుడు ప్రపంచ దేశాల సెలబ్రిటీలను సైతం కాలు కలిపేలా చేస్తోంది. ఇప్పటికే చాలామంది ఈ సాంగ్ డాన్స్ చేసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సాంగ్ కి ఇప్పుడు ఒక పాకిస్తానీ నటి తనదైన స్టైల్ లో స్టెప్పులేసి ఆకట్టుకోవడం హాట్ టాపిక్గా మారింది. అసలు విషయం ఏమిటంటే పాకిస్తాన్ లో సినీ నటిగా, టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న హనియా అమీర్ ఈ నాటు నాటు సాంగ్ కి స్టెప్పులు వేస్తూ అదిరిపోయేలా డాన్సులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంది.
ఒక పెళ్లి వేడుకలో తన సహ నటుడు సబూర్ అలీతో కలిసి ఆమె ఈ స్టెప్పులు వేసింది. ఇక ప్రస్తుతానికి హనియా అమీర్ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాక సోషల్ మీడియాలో ఆమె చేసిన డాన్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సాంగ్ కు గాను ఆమె మీద విపరీతంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హనియా అమీర్ కేవలం నాటు నాటు సాంగ్ మాత్రమే కాదు భారతీయ సినిమాల మీద తనకున్న ప్రేమని ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంటుంది. అలా గత నెలలో కూడా ఆమె ఒక వీడియో షేర్ చేసింది, అందులో కూడా ఆమె తన స్నేహితుడితో కలిసి నాటు నాటు సాంగ్ కి స్టెప్ వేయడం కనిపించింది.
Also Read: Manchu Manoj Marriage: మంచు మనోజ్ రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఆరోజే ఆమెతో ఏడడుగులు!
Also Read: Anasuya Bharadwaj on Gays: ఫ్రెండ్స్, ఫామిలీలో 'గే'లు ఉన్నారు.. అనసూయ ఆసక్తికర కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook