Hansika Comments: ఆ హీరో వెంటపడ్డాడు.. సరైన బుద్ధి చెప్పా.. హన్సిక సంచలనం!

Hansika shocking Allegation: దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక తాజాగా ఒక తెలుగు హీరో మీద సంచలన ఆరోపణలు చేసింది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Hansika shocking Allegations on a Telugu hero: తెలుగులో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయిన హన్సిక గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి అంతకంటే ముందే చైల్డ్ గా హిందీలో కొన్ని సినిమాలు సీరియల్స్ చేసిన ఆమె హీరోయిన్ గా దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 50కి పైగా సినిమాలు చేసింది.
అయితే ఒకప్పుడు వరుసగా హీరోయిన్గా అనేక సినిమాలు చేస్తూ వచ్చిన హన్సిక సినిమా అవకాశాలు తగ్గడంతో ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే అతను మరెవరో కాదు హన్సిక బెస్ట్ ఫ్రెండ్ మాజీ భర్త అని తెలియడంతో ఆమె మీద ట్రోల్స్ కూడా వచ్చాయి. ఆ సంగతి అలా ఉంచితే ప్రస్తుతం ఆమె కొన్ని సినిమాలు వెబ్ సిరీస్ చేసుకుంటూ లైమ్ లైట్లోనే ఉంటోంది. తాజాగా బాలీవుడ్ లో ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిన హన్సిక టాలీవుడ్ గురించి ఇక్కడికి హీరోల గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Also Read: Shriya Saran Photos: మెమోరీస్ అంటూ శ్రియ శరన్ హాట్ షో.. తల్లైనా తగ్గట్లేదుగా!
టర్వ్యూలో హన్సిక మాట్లాడుతూ టాలీవుడ్ లో ఒక హీరో తనను బాగా ఇబ్బంది పెట్టాడని వెల్లడించింది. తనని రోజు డేట్ కి రమ్మని అడుగుతూ డేట్ కి వస్తావా రావా అంటూ ఫోన్లు మెసేజ్లతో విసిగించాడని చెప్పుకొచ్చారు. అయితే ఆ హీరోకి మాత్రం తగిన బుద్ధి చెప్పానని అప్పటినుంచి మళ్ళీ ఇప్పటిదాకా నా జోలికి రాలేదని ఆమె కామెంట్ చేసింది. హన్సిక నిజానికి అల్లు అర్జున్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ప్రభాస్, రామ్, నితిన్, మంచు విష్ణు, రవితేజ లాంటి టాలీవుడ్ స్టార్లతో నటించింది.
దీంతో ఆమె ఏ టాలీవుడ్ హీరో గురించి మాట్లాడింది అనే విషయం మీద చర్చ జరుగుతోంది. ఎందుకంటే టాలీవుడ్ హీరోలు అందరూ కూడా ఇలాంటి విషయాలకు దూరంగానే ఉంటారు. మరి ఆమెతో డేట్ చేయాలని ప్రయత్నించిన హీరో ఎవరు? అనే విషయం మీద ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే ఆమెను ఇబ్బంది పెట్టిన హీరో ఆమెతో నటించిన హీరోనా లేక వేరే హీరోనా అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది చూడాలి మరి ఏం జరగబోతోంది అని.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook