Hansika Marriage: హీరోయిన్ హన్సిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై తమిళ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సౌతిండియాకు చెందిన ఓ పెద్ద రాజకీయ నేత కుమారుడిని వివాహం చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఇరు కుటుంబాలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఎంగేజ్‌మెంట్ జరగనుందని గుస గుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానున్నట్లు కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా హన్సిక పరిచమయ్యింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాల్లోకి వేసుకుంది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. అదే స్పీడ్‌తో కనుమరుగు అయ్యింది. దేశముదురు, దేనికైనా రెడీ, కందిరీగ వంటి హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్ద హిట్ కాకపోవడంతో కోలీవుడ్‌కు వెళ్లిపోయింది. 


అక్కడ లేడీ ఓరియంటెడ్‌, గ్లామర్ రోల్స్ పోషిస్తూ ముందుకు సాగుతోంది. రెండేళ్ల తర్వాత ఆమె మహా చిత్రంలో నటించింది. త్వరలో మూవీ విడుదల కానుంది. ఈఏడాది వరుసగా సినిమాకు ఓకే చెబుతోంది. ఈఏడాది దాదాపు ఆరుకు పైగా సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో తన అభిమానులకు హన్సిక శుభవార్త చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈనెలాఖరు లోపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 


Also read:Gorantla Madhav: న్యూడ్ వీడియో అంతా కుట్ర..న్యాయ పోరాటం చేస్తానన్న ఎంపీ గోరంట్ల మాధవ్..!


Also read:Smriti Mandhana: టీమిండియా మహిళా ప్లేయర్ స్మృతి మంధాన ఖాతాలోకి అరుదైన రికార్డు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook