Rebels Of Thupakulagudem Teaser : చిన్న సినిమాలు పెద్ద సినిమాలు.. స్టార్ హీరోలు, కొత్త హీరోలు అన్నా తేడాలను ప్రేక్షకులు చూడటం లేదు. సినిమా బాగుంటే.. కొత్త కథ అయితే.. కంటెంట్ నచ్చితే సినిమాలు చూస్తున్నారు. ఇండస్ట్రీలో మేకింగ్ మారుతున్న ఈ సమయంలో కొత్త రకం కథలు వస్తున్నాయి. కొత్త వారు కొంగొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ ఓ సినిమాను నిర్మిస్తోంది. రెబల్స్ ఆఫ్‌ తుపాకులగూడెం అనే సినిమాను జైదీప్ విష్ణు తెరకెక్కిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీ టీజర్‌ను సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేశాడు. టీజర్‌ను చూసిన హను రాఘవపూడి మెచ్చుకున్నాడు. సినిమా టీంకు కంగ్రాట్స్ తెలిపాడు. అయితే ఈ టీజర్‌లో మాత్రం జనాలకు ఇంట్రెస్ట్‌ కలిగించేలా ఎన్నో విషయాలున్నాయి. టీజర్ చూస్తే సినిమాకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి.


 



149 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో హీరో పాత్ర చుట్టూనే కథ తిరిగుతోన్నట్టుగా కనిపిస్తోంది. 'నా పేరు కుమార్.. ఇది నా ఊరు.. వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు.. కానీ మనం ఆడింది వందే' సినిమా నేపథ్యం ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు.అయితే ఇందులో అడవి ఏంటి? అడవుల్లో నక్సలైట్ల మాదిరి గన్నులు పట్టుకుని ఎందుకు కనిపిస్తున్నారు.. అసలు ఈ కథలో మళ్లీ లవ్ స్టోరీ ఏ పాళ్లలో ఉంటుంది? అనే ఆసక్తిని రేకెత్తించేసింది. 


ప్రవీణ్‌ కండెలా, జయేత్రి మకానా హీరోహీరోయిన్లుగా వస్తోన్న ఈ సినిమా సాంకేతికంగా ఉన్నత స్థాయిలో కనిపిస్తోంది. శ్రీకాంత్ అర్పుల కెమెరా, మణిశర్మ సంగీతం, ఆర్ఆర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేట్టుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉండగా.. రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చే జనవరి 26న విడుదలకానుంది.


Also Read : Ileana Latest Pics : ఫుల్లుగా కప్పేసుకున్న ఇలియానా.. కొత్త లుక్కులో గోవా బ్యూటీ


Also Read : Jabardasth Anchor Sowmya : హే చీ పోరా.. హైపర్ ఆదికి జబర్దస్త్ యాంకర్ పంచ్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook