HanuMan in MovieRulz: ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన తాజా చిత్రం హను-మాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్‌ రెస్పాన్స్ తెచ్చుకుంది. అభిమానుల భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మహేశ్‌బాబుతో చిత్రం గుంటూరు కారంతో పోటీలో నిలిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. అయితే గుంటూరు కారం నెగిటివ్ టాక్ సొంతం చేసుకోగా హనుమాన్ మాత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఏకంగా 21 కోతులు సంపాదించగా రెండవ రోజు బాక్సాఫీస్ కలెక్షన్లలో 55.65% పెరుగుదల కనబరిచింది. తొలి శనివారం ఈ చిత్రం రూ. 12.53 కోట్లు వసూలు చేసింది. ఇందులో తెలుగు వెర్షన్ నుంచి రూ. 8.4 కోట్లు, హిందీ వెర్షన్ నుంచి రూ. 4.13 కోట్లు వచ్చాయి. 


అయితే ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్న ఈ సినిమాని ప్రస్తుతం పైరసీ వెంటాడుతోంది. ఈ చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే అనగా జనవరి 12 రాత్రికే ఈ సినిమాని ఆన్లైన్లో పెట్టేశాయి కొన్ని వెబ్సైట్లు. ఇప్పటికే ఈ చిత్రం ఐ బొమ్మ.. మూవీ రూల్స్.. లాంటి సైట్స్ లో చూడడానికి అలానే డౌన్లోడ్ చేసుకోవడానికి లభ్యంగా ఉంది. ఎన్నో అంచనాలతో.. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాని కూడా ఇలా పైరసీ వెంటాడదంతో నిరాశకి గురవుతున్నారు సినీ ఇండస్ట్రీ ప్రజలు. మరి ఈ విషయంపై హనుమాన్ టీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


ఈ చిత్రంలో హనుమంతు అనే కథానాయకుడిగా తేజ సజ్జా నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే  అంజనాద్రి లో ఉందే హనుమంతుకి అనుకోని పరిస్థితుల్లో హనుమంతుడి ఆయుధం ఒకటి దొరికి అద్భుతమైన శక్తులు వస్తాయి. ఆ శక్తులతో లోకానికి చెడు చెయ్యాలి అనుకునే విలన్ ని హనుమంతు ఎలా హతం చేశారు అనేది మిగిలిన కథ. ఇక ఈ చిత్రానికి రెండో భాగం కూడా చివరిలో ప్రకటించారు దర్శకుడు.
11 భాషల్లో పాన్‌ ఇండియా సినిమాగా వచ్చిన హనుమాన్‌ అన్ని భాషల్లోనూ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకి యూఎస్‌లో భారీగా స్పందన వస్తోంది.  హనుమాన్ సినిమా ప్రీమియర్ షోలకు అక్కడ 297 లొకేషన్లలో 553 షోలు ప్రదర్శించారట. అంతేకాకుండా ఈ చిత్రం మహేష్ బాబు గుంటూరు కారం కలెక్షన్స్ ని కూడా అక్కడ దాటి వేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు


Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook