Hanuman Jayanti Wishes: ఆంజనేయ స్వామికి తాను పరమ భక్తుడనని మెగాస్టార్ చిరంజీవి అనేక సందర్భాల్లో వెల్లడించారు. అయితే శనివారం (ఏప్రిల్ 16) హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన ఓ స్పెషల్ వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'ఆచార్య' షూటింగ్ మధ్యలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. షూటింగ్ సెట్ లోకి అనుకోని అతిథి వచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేవాలయాల అవినీతి కథాంశంతో రూపొందిన 'ఆచార్య' మూవీలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో చిరంజీవి, రామ్ చరణ్.. నక్సల్స్ గానూ తెరపై కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ను అడవిలో చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో రామ్ చరణ్ మేకప్ వేసుకుంటున్న సమయంలో అటుగా ఓ వానరం వచ్చింది. 


ఆ వానరం రాకను ఆంజనేయ స్వామితో పోల్చారు నటుడు చిరంజీవి. అయితే ఆ వానరాన్ని గమనించిన చరణ్.. తన వద్ద ఉన్న బిస్కెట్స్ ను వానరానికి ఇచ్చాడు. ఆ వానరం వాటిని తింటూ కూర్చుంది. ఆ వీడియోను షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  



Also Read: Adah Sharma: హాట్ ఫోటోస్‌తో యువకులకు హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న అదా శర్మ.. చూస్తే మతి పోవాల్సిందే!


Also Read: KGF‌2 Advance Bookings Collection: కేజీఎఫ్‌2 అడ్వాన్స్ బుకింగ్స్ వసూళ్లు ఎంతంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook