HanuMan::వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైపోయిన హనుమాన్.. ఓటిటి పరిస్థితి మాత్రం అయోమయం!
HanuMan OTT date: ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రం హనుమాన్. స్టార్ హీరోల సినిమాలు సైతం వెనక్కి నెట్టి సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి కన్నా ముందు ఓరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం కావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
HanuMan World Television Premiere:
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా హనుమాన్. ఈ సంవత్సరం స్టార్ హీరోల సరసన సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా వారందరి చిత్రాలను వెనక్కినెట్టీ మరి సూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమాతో పాటు సంక్రాంతికి విడుదలైన తెలుగు సినిమాలన్నీ ప్రస్తుతం ఓటిటి లో అవుతున్నాయి. కానీ ఈ చిత్రం మాత్రం ఇంకా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభించలేదు. జి ఫైవ్ లో మార్చి 8వ తేదీన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ మొదలవుతుందని ప్రచారం రాసాగింది. అయితే మార్చి 8 వచ్చిన ఈ సినిమా స్ట్రీమింగ్ మాత్రం మొదలు కాలేదు.
సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఎంతోమంది అభిమానులు ప్రస్తుతం జీ5 సోషల్ మీడియా పేజీలో కామెంట్లు కూడా పెడుతున్నారు. దీంతో శివరాత్రి రోజు హనుమాన్ సినిమాను జి ఫైవ్ లో చూద్దామని ఆశించిన సినీ ప్రియులకు నిరాశే మిగిలింది. ఇలా ఓటీటీ స్ట్రీమింగ్ కి క్లారిటీ తెచ్చుకొని ఈ సినిమా ఇప్పుడు ఏకంగా వరాలతో టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం కావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
ఈ సినిమా తెలుగు వర్షన్ అయితే కాదు హనుమాన్ హిందీ వెర్షన్ మాత్రం అప్పుడే టీవీ ప్రీమియర్ కు రెడీ అయిపోయింది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
‘మన విశ్వంలో తొలి సూపర్ హీరో ఇప్పుడు టీవీ స్క్రీన్లపై కనిపించనున్నాడు. మార్చి 16 రాత్రి 8 గంటలకు హనుమాన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ హిందీ భాషలో తొలిసారి కలర్స్ సినీప్లెక్స్, జియో సినిమాల్లో చూడండి’ అని బాలీవుడ్ మీడియా అలానే హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్వీట్స్ కూడా వేసేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే మార్చి 16న టెలివిజన్ ప్రీమియర్ ఉండటంతో ఆలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందేమోనని సినీ లవర్స్ భావిస్తున్నారు. మరి ఈ చిత్రం అన్ని భాషల్లో అంతలోపే ఓటీటీ స్క్రీమింగ్ ప్రారంభం చేయనుందా లేదా తెలియాల్సి ఉంది.
Also Read: మెగా కాంపౌండ్ హీరోల కష్టాలు.. ఇక రంగంలోకి మెగాస్టార్ దిగాల్సిందేనా!
Also Read: బావ ఈజ్ బ్యాక్.. మిస్టర్ ఈగో చిందులు.. బెడ్‌రూం కంటే జైలు బెట్టర్ అంటున్న కల్యాణ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter