Happy Birthday Rana Daggubati Swag of Daniel Shekar from Bheemla Nayak out : పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల కాంబోలో వస్తోన్న మూవీ భీమ్లా నాయక్. సాగర్‌ కె. చంద్ర డైరెక్టర్. ఈ మూవీని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే భీమ్లా నాయక్ నుంచి రిలీజైన పోస్టర్స్‌, పాటలు, గ్లింప్స్‌ అన్నీ అదిరిపోయాయి. ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇవాళ రానా పుట్టిన రోజు సందర్భంగా భీమ్లా నాయక్ (Bheemla Nayak) నుంచి ఒక వీడియోను (Swag of Daniel Shekar) రిలీజ్ చేశారు మేకర్స్‌. మా ర్యాగింగ్ డానియల్ శేఖర్‌‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మూవీ యూనిట్ విషెస్ తెలిపింది. స్వాగ్ ఆఫ్ డానియల్‌ శేఖర్‌ (#SwagofDanielShekar) వీడియో రిలీజైంది. 
 
వాడు అరిస్తే భయపడతావా.. నేను వాడికన్నా గట్టిగా అరవగలను.. అయినా ఎవడాడు.. దీనమ్మ దిగొచ్చాడా.. ఆఫ్ట్రాల్ ఎస్సై.. సస్పెండెడ్.. అంటూ డైలాగ్‌లు అదరగొట్టేశాడు రానా.



 


Also Read : నా ఫ్యామిలీని అస్సలు ఇబ్బంది పెట్టను.. సమంతపై సెటైర్లు పేల్చిన నాగ చైతన్య!!



మలయాళంలో సూపర్ హిట్‌ అయిన అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌ రీమేక్‌గా భీమ్లా నాయక్ (Bheemla Nayak) తెరకెక్కుతోంది. నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌ హీరోయిన్స్. దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు. తమన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ మూవీకి నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 


Also Read : Natasha Stankovic: పాపం హార్ధిక్ పాండ్యా-మరో వ్యక్తితో భార్య రొమాన్స్-వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook