బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన దర్శకధీరుడు రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా  శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖల నుంచి సినీ తారల వరకు అందరూ క్యూ కట్టి మరి రాజమౌళికి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రాజ్ మౌళికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "తెలుగు ఫిల్మ్ మేకర్ దిగ్గజానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తూ ఉండాలి." అని ట్వీట్ చేశారు. బాహుబలి  మూవీ యూనిట్, హీరో ప్రభాస్ తో పాటు పలువురు హీరోలు, హీరోయిన్స్  రాజమౌళికి బర్త్ డే విషెస్ తెలిపారు. రకరకాల ఫోటోలు, పోస్టర్లతో రాజమౌళి ఫ్యాన్స్ శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.