`భళ్లాలదేవుడి`కి `బర్త్ డే` శుభాకాంక్షలు
`లీడర్` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత `ఘాజీ ఎటాక్` లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి..`బాహుబలి` విడుదలయ్యాక, భళ్లాలదేవుడిగా కూడా ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు రానా దగ్గుబాటి.
'లీడర్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత 'ఘాజీ ఎటాక్' లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి..'బాహుబలి' విడుదలయ్యాక, భళ్లాలదేవుడిగా కూడా ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు రానా దగ్గుబాటి. ఈ రోజు 'రానా' పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని పలు ముఖ్యమైన విషయాలు మీకోసం ప్రత్యేకం
- 14 డిసెంబరు, 1984 తేదిన చెన్నైలో జన్మించిన రానా, ప్రముఖ నిర్మాత రామానాయుడికి స్వయానా మనవడు.
- సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడైన రానా తొలి చిత్రం 'శేఖర్ కమ్ముల' దర్శకత్వం వహించిన 'లీడర్'.
- రానా పలు హిందీ చిత్రాలలో కూడా నటించారు. అందులో దమ్ మారో దమ్, డిపార్ట్‌మెంట్, యే జవానీ హై దివానీ, బేబీ చిత్రాలు ప్రముఖమైనవి.
- రానా తాను నటించిన 'లీడర్' చిత్రానికి గాను తొలిసారిగా ఉత్తమ నూతన నటుడిగా' ఫిల్మ్ ఫేర్' పురస్కారం అందుకున్నారు.
- రానా గ్రాఫిక్ డిజైనర్ కూడా. ఆయన విజువల్ కమ్యూనికేషన్స్‌లో కోర్సు కూడా చేశారు. 2006లో విడుదలైన 'సైనికుడు' చిత్రానికి ఆయన విజువల్ ఎఫెక్ట్స్ కో ఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు
- రానా నిర్మాతగా మారి ఓ బాలల చిత్రాన్ని కూడా రూపొందించారు. 'బొమ్మలాట - ఏ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్' పేరుతో విడుదలైన ఆ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం కూడా అందుకుంది.
- ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన "బాహుబలి" చిత్రంలో భళ్లాలదేవుడిగా నటించిన రానా, ఆ పాత్రతో ఉత్తరాది ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆ చిత్రానికి గాను తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకున్నారు.
- రానా టెలివిజన్ వ్యాఖ్యతగా కూడా పలుమార్లు వ్యవహరించారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రసారమైన 'నెంబర్ 1 యారీ' ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యతగా కూడా వ్యవహరించారు.
- ఒకప్పుడు రాజేష్ కన్నా హీరోగా నటించిన సూపర్ హిట్ హిందీ చిత్రం "హాథీ మేరే సాథీ"ని రానా కథానాయకుడిగా రీమేక్ చేస్తున్నారు దర్శకుడు ప్రభు సాల్మన్.