Hari Teja Singing : వాటికంటే ముందు నేను చేసిన పని ఇదే.. హరితేజ కామెంట్స్ వైరల్
Hari Teja Singing హరితేజ తాజాగా సింగింగ్ టాలెంట్‌ను బయటపెట్టేసింది. మామూలుగానే హరితేజ తన పాటలతో బిగ్ బాస్ ఇంట్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నిజంగానే హరితేజ ఓ ప్రొఫెషనల్ సింగర్‌గా అవతారమెత్తింది.
Hari Teja Singing హరితేజ బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో పాటలు పాడుతూ, హరికథలు చెబుతూ, డ్యాన్సులు చేస్తూ కామెడీ పండిస్తూ.. అందరినీ నవ్వించింది. హరితేజ తనలోని సింగింగ్ టాలెంట్‌ను బయట పెట్టేసింది. అధికారికంగా సింగర్‌గా మారిపోయింది. ఇదే విషయాన్ని హరితేజ చెబుతూ తన సంతోషాన్ని బయటపెట్టేసింది. ఎప్పటి నుంచో సింగర్ అవ్వాలని చూస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది.
1990-2000 దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె ప్రాంతానికి చెందిన ప్రెస్ క్లబ్‌లోని స్ట్రింగర్స్ నేపథ్యం, మీడియా కవరేజ్ ఎలా ఉంటుంది.. మీడియా ఓ ఘటనపై ఎలా స్పందిస్తుందనేది అనే విషయాన్ని ఎంతో సెటైరికల్‌గా చూపించినట్టు అనిపిస్తోంది. న్యూసెన్స్ అంటూ రాబోతోన్న ఈ వెబ్ సిరీస్ నుంచి అప్డేట్ వచ్చింది.
ఈ వెబ్ సిరీస్‌ను శ్రీ ప్రవీణ్ దర్శకత్వం తెరకెక్కిస్తుండగా.. కార్తికేయ 2వ వంటి బ్లాక్ బస్టర్స్‌ను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. తాజాగా ఈ వెబ్ సిరిస్‌ఓ రొమాంటిక్ ఫీల్ గుడ్ సాంగ్‌ను విడుదల చేశారు. మయినీరు పిల్లగాడా అంటూ సాగే ఈ పాటకు పెంచల్ దాస్ సాహిత్యాన్ని అందించగా.. హరి తేజ ఆలపించారు. సురేష్ బొబ్బిలి బాణీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇందులో నవదీప్, బిందు మాధవిల కెమిస్ట్రీ ఎంతో చక్కగా కుదిరినట్టు కనిపిస్తోంది.
Also Read: Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్
అయితే ఈ పాట గురించి చెబుతూ.. ఈ పాట గురించి మీకు చెప్పడం నాకు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంది.. డ్యాన్సింగ్, యాక్టింగ్‌ల కంటే ముందే నేను ఈ పాటలు పాడటాన్ని నేర్చుకున్నాను.. నా జీవితంలో మ్యూజిక్‌కు ఎంతో స్పెషల్ ప్లేస్ ఉంటుంది.. మీరంతా ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది హరితేజ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook