Changes in Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ముందుగా భవదీయుడు భగత్‌ సింగ్‌ అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అదే సినిమా తెరకెక్కుతుందని అందరూ ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా ఆ సినిమాకు బ్రేకులు పడ్డాయి. భవదీయుడు భగత్ సింగ్ స్థానంలో ఉస్తాద్‌ భగత్ సింగ్ అనే సినిమా అనౌన్స్ చేశారు. భవదీయుడు భగత్ సింగ్‌లో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నాడని ప్రచారం అయితే జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉస్తాద్‌ భగత్ సింగ్‌లో మాత్రం ఆయన పోలీసు పాత్రలో నటిస్తున్నాడు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఇది తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన తేరీ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.ఆ తమిళ సినిమా ఇప్పటికే తెలుగులో పోలిసోడు పేరుతో అందుబాటులో కూడా ఉంది. ఇక ఈ సినిమాను ఉన్నది ఉన్నట్టుగా ఉంచకుండాఉస్తాద్ భగత్ సింగ్ కోసం కీలకమైన మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.


తేరి సినిమాలో ఒక చిన్న పాప పాత్రలో ఇప్పుడు తెలుగులో ఒక బాబుని ప్రవేశ పెట్టబోతున్నారని తెలుస్తోంది. దానికి సంబంధించి ఆడిషన్స్ కూడా మొదలు పెట్టారని అంటున్నారు. ఇక తేరి సినిమాలో పోలీసు నుంచి తన కుమార్తె కోసం విజయ్ ఒక బేకరీ ఓపెన్ చేసి... ఆ బేకరీ నడుపుకుంటూ ఉండే వ్యక్తిగా కనిపించగా.. ఉస్తాది భగత్ సింగ్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అంటే భవదీయుడు భగత్ సింగ్.. ఉస్తాద్ భగత్ సింగ్‌ రెండు కథలు కలిపారా అనే ప్రచారం కూడా జరుగుతోంది.


అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద క్లారిటీ లేదు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తుందని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమవుతుంది అనేది.
Also Read: RRR Craze: ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ నెంబర్ 1, రామ్ చరణ్ నెంబర్ 2.. ఇది కదా క్రేజ్ అంటే?


Also Read: ‘The Elephant Whisperers’ on OTT: ఆస్కార్ గెలిచిన ఎలిఫెంట్ విస్పరర్స్ ఏ ఓటీటీలో చూడాలో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook