Harish Shankar :


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ డైరెక్టర్లలో హరీష్ శంకర్  ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో హరీష్ శంకర్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అంతేకాదు అప్పట్లో పవన్ కళ్యాణ్ కి 10 సంవత్సరాల తర్వాత సూపర్ హిట్ అందించిన డైరెక్టర్‌ గా నిలిచారు. చాలా కాలం తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో ప్రేక్షకులకు ముందుకి రాబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ చిత్రం తమిళ్లో సూపర్ హిట్ అయిన తేరీ సినిమాకి రీమేక్ అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.


తేరీ సినిమా తెలుగులో పోలీసోడు అనే టైటిల్ తో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అలాంటిది ఆ సినిమాని మళ్లీ రీమేక్ చేయాల్సిన అవసరం ఏముంది అని పవన్ కళ్యాణ్ అభిమానులు హరీష్ శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇక ఈ మధ్యనే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి కూడా అభిమానులు పోస్టర్‌ లో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ లాగా కంటే హరీష్ శంకర్ లాగా కనిపిస్తున్నారని ట్రోల్ చేశారు. ఇక ఇంత నెగిటివిటీ మధ్య సినిమా గురించి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ విషయంలో నోరు జారటం అందరినీ షాక్ కి గురిచేసింది.


తాజాగా మహా మాక్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాంచ్ కి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ని సర్దార్ భగత్ సింగ్ అని పిలవటం తో మళ్ళీ సినిమా చర్చలోకి వచ్చింది. పొరపాటున పవన్ కళ్యాణ్ అలా పలికినప్పటికీ అభిమానులను మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకుంటున్నారు. ఇప్పటికే నెటిజెన్లు సోషల్ మీడియాలో హరీష్ శంకర్ పై మరొకసారి ట్రోలింగ్ బీభత్సంగా మొదలుపెట్టేశారు.


ఇకశ సినిమాకి సంబంధించి మార్లు పలు పలు రకాల పుకార్లు వినిపిస్తూ ఉండడంతో హరీష్ శంకర్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టి తనని తాను డిఫెండ్ చేసుకుంటున్నార. కాగా హరీష్ సినిమా గురించి.. అసలు ఈ సినిమా నిజంగా విజయ్ సినిమా రీమేక్ కాదా అన్న విషయం గురించి మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఏదేమైనా కనీసం సినిమా విడుదల అయ్యాక అయినా హరీష్ శంకర్ మీద ఈ ట్రోలింగ్ ఆగుతుందో లేదో వేచి చూడాలి. గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ అవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా పైన కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీగా అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా చుట్టూ అల్లుకున్న అనుమానాలు, వివాదాల వల్ల దర్శకుడికి మాత్రం తిప్పలు తప్పట్లేదు.


Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?


 


Also Read: TDP-Janasena: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ-జనసేన పోరాటం.. ఉమ్మడి తీర్మానాలు ఇవే..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.