Harish Shankar Remake with Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా అనౌన్స్‌మెంట్‌ చాలా కాలం క్రితమే వచ్చింది. అయితే ఆ తర్వాత ఆ సినిమా నుంచి ఒక పోస్టర్ కూడా విడుదలైన  తర్వాత సినిమా గురించి ఒక్క అప్‌డేట్‌ కూడా బయటికి రాలేదు. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి భవదీయుడు భగత్ సింగ్ సినిమా స్టోరీలైన్‌ పవన్ విన్నప్పుడు నచ్చిందట. కానీ పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ సిద్ధం చేసి.. తీసుకువెళ్లిన తర్వాత అది తనకు సూట్ అవ్వదని పవన్ భావించారట. అందుకే కొన్నాళ్ల పాటు తాను ఈ సినిమా చేయలేనని హరీష్ శంకర్‌కు తేల్చి చెప్పారని తెలుస్తోంది. దీంతో సినిమా ఆగిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి... కానీ అసలు విషయం అది కాదని అంటున్నారు. ఆ సినిమా ఆగిపోయిన సంగతి కరెక్టే కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్‌లో చేయడానికి మాత్రం మరో కథ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు .


ఇప్పటికే వీరిద్దరూ కలిసి విజయ్ హీరోగా నటించిన తేరి అనే సినిమాని రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  వాస్తవానికి ఈ సినిమాని ఇప్పటికే తెలుగులో పోలీసోడు అనే పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. కానీ రీమేక్ హక్కులు మైత్రి మూవీ మేకర్ సంస్థ దగ్గర ఉండడంతో ఈ సినిమాని పవన్ కళ్యాణ్‌తో రీమేక్‌ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


ఒక పక్క పవన్ కళ్యాణ్ మరో పక్క హరీష్ శంకర్ ఇద్దరికీ కూడా రీమేక్ సినిమాలు చేసి సూపర్ హిట్‌లు అందుకున్న అనుభవం ఉండడంతో వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారని ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఈ విషయం మీద క్లారిటీ లేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం హరీష్‌ శంకర్ చెప్పిన భవదీయుడు భగత్ సింగ్ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఏ మాత్రం హ్యాపీగా లేరని అందుకే దాన్ని పక్కన పెట్టారని అంటున్నారు.


Also Read: Dil Raju Trolled : సిగ్గు -నీతి - మానం లేనిదే సినిమా అయితే, ఆ సంగతేంటి రాజు గారూ?


Also Read: Jai Balayya Song : నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన దృష్టి.. ట్యూన్ మీద పెట్టాల్సింది.. కాపీ ట్యూన్‌తో తమన్‌పై ట్రోల్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook