Michael Gambon Passes away: హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. హ్యారీ పోటర్‌ ఫేమ్‌ సర్‌ మైఖేల్‌ గాంబోన్‌ (82) కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. గాంబోన్‌ మరణవార్తను ఆయన ఫ్యామిలీ ధృవీకరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాంబోన్‌ ‘హ్యారీ పోటర్‌’ సిరీస్‌లో ప్రొఫెసర్‌ ‘ఆల్బస్‌ డంబుల్‌ డోర్‌’ పాత్రలో నటించారు. ఎనిమిది హ్యారీ పోటర్ చిత్రాలలో ఆరింటిలో హాగ్వార్ట్స్ హెడ్‌మాస్టర్ గా ఈయన కనిపించారు.  ఆయన మరణవార్త ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను షాక్ కు గురిచేసింది. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ కెరీర్‌లో అతను ఏ పాత్ర చేసిన అందులో జీవించేవాడు. గాంబోన్‌.. ఫెంటాస్టిక్‌ మిస్టర్‌ ఫాక్స్‌లో ఫ్రెంచ్‌ డిటెక్టివ్‌ మైగ్రేట్‌గా, ది సింగింగ్‌ డిటెక్టివ్‌తో పాటు పలు చిత్రాల్లో నటించారు. 


1940 అక్టోబర్‌ 19న ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో మైఖేల్‌ గాంబోన్‌ జన్మించారు. ఆ తర్వాత లండన్‌లో పెరిగారు. తొలుత ఇంజినీర్‌గా శిక్షణ పొందిన ఆయన ఆ తర్వాత నాటకరంగం నుంచి సినిమాల్లోకి ప్రవేశించారు. మూడు ఆలివర్‌ అవార్డులు, రెండు స్క్రీన్‌ యాక్టర్‌ అవార్డులతో పాటు నాలుగు బ్రిటీష్‌ అకాడమీ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ (BAFTA) అవార్డులను అందుకున్నారు. నాటకరంగంలో ఆయన చేసిన సేవకు క్వీన్ ఎలిజబెత్ II 1998లో ‘నైట్స్‌’ బిరుదును కూడా ప్రదానం చేశారు. 2015లో ఆయన సినిమాలకు వీడ్కోలు పలికారు. 



Also Read: Skanda Movie Review: రామ్‌-బోయపాటి 'స్కంద' ఆడియెన్స్ ను మెప్పించిందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook