దగ్గుబాటి రానా 'బాహుబలి2' తో అంతర్జాతీయ నటుడిగా మారి ప్రేక్షకులకు చేరువయ్యాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమా తరువాత ఆయన 'హాతి మేరీ సాథి' లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రానా బాన్దేవ్ గా కనిపించబోతున్నాడు. అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ గా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో రానా ఏనుగు తొండాన్ని పట్టుకొని నిలబడి ఉన్న స్టిల్ ఆకట్టుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1971లో హిందీలో విడుదలై ఘనవిజయం సాధించిన రాజేష్ ఖన్నా నటించిన 'హాతి మేరీ సాథి' కి ఈ చిత్రం రీమేక్. దర్శకుడు సోలొమన్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ట్రినిటీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2018 జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. దీపావళిలో సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.  


ఇదేగాక రానా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యంలోని ఒక సైనికుడి ప్రేమకథ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. అదేవిధంగా .. పీరియడ్ డ్రామా గా తెరకెక్కనున్న చిత్రంలో ట్రావన్కోర్ రాజు అంజిమ్ తిరునాల్ మార్తాండ వర్మ పాత్రను రానా పోషిస్తున్నాడు.