Zero Size: ఇంతకీ ఈమెకు నడుము ఉందా లేదా అసలు
ఒకటో రెండో కావాలమ్మా భూతద్దాలు..ఉందో లేదో చూడాలంటే నీ నడుముని.. ఇది సినిమాలో పాట.సినిమాలో ఇది అతిశయోక్తి కావచ్చుకానీ నిజ జీవితంలో నిజమే..ఒకట్రెండు కాదు నాలుగైదు భూతద్దాలతో వెతికినా కన్పించని నడుమది. ఆ విశేషాలేంటో చూద్దాం.
ఒకటో రెండో కావాలమ్మా భూతద్దాలు..ఉందో లేదో చూడాలంటే నీ నడుము ( Waist )ని.. ఇది సినిమాలో పాట.సినిమాలో ఇది అతిశయోక్తి కావచ్చుకానీ నిజ జీవితంలో నిజమే..ఒకట్రెండు కాదు నాలుగైదు భూతద్దాలతో వెతికినా కన్పించని నడుమది. ఆ విశేషాలేంటో చూద్దాం.
ఇప్పుడంతా జీరోసైజ్ ట్రెండ్ ( zero size ) నడుస్తోంది. నడుము నాజూగ్గా ఉంటే..జీరోసైజ్ అయితే ఆ లుక్కే వేరు. ఆ కిక్కే వేరు. తెలుగు సినీ హీరోయిన్లలో ఇలియానాను జీరో సైజ్ నడుముగా చెబుతారంతా. కానీ ఈ అమ్మాయి మాత్రం అందర్నీ మించిపోయింది. నాజూకు నడుము కాదు కదా..అసలు నడుమనేది ఉందా లేదా అనే సందేహం రాకమానదు. నిజమే.. మయన్మార్ కు చెందిన 23 ఏళ్ల సుమోహ్ నాయింగ్ ( Sumohnaing ) తన లేని నడుముతో తెగ ఫేమస్ అవుతోంది. ఇన్ స్టాగ్రామ్ ( Instagram ) లో తాను పెట్టిన ఫోటోలు చూసి ఆశ్చర్యపోయిన ప్రశంసలు కురిపించే వారితో పాటు ఇదంతా ఫేక్ అంటూ విమర్శించివారు కూడా లేకపోలేదు. ఈ నడుము ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత చిన్న నడుముగా ప్రాచుర్యం పొందింది. ఇంతకీ ఈ అమ్మాయి నడుుము సైజ్ ఎంతో తెలుసా..కేవలం 13.7 ఇంచులు. అందుకే అనుకుంటా చూసినోళ్లు మాత్రం...దేవుడు నడుమును పెట్టడం మర్చిపోయినట్టున్నాడంటున్నారు.
తన నడుము చూసి ఈర్ష్యతో ఫేక్ అని కామెంట్ చేసేవారికి నాయింగ్ ఒకటే సమాధానం చెబుతోంది. నా నడుము సహజమైనది..దీనికోసం ఎలాంటి శస్త్ర చికిత్సలు చేయించలేదు. నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను. నడుమును ఇలా మెయింటైన్ చేయడానికి హెల్దీ డైట్ ( Healthy diet ) తీసుకుంటాను అంటోంది. Also read: Sushant Death: ఫిబ్రవరి 25 ఫిర్యాదుపై చర్యలేవి ?