OG Movie Glimpse: నేడు( సెప్టెంబరు 02) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan Birth Day) పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ సినిమా మేకర్స్ అదిరిపోయే అప్డేట్స్ ను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే 'హరిహర వీరమల్లు' నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా.. తాజాగా 'ఓజీ'(OG Movie) నుంచి కూడా సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. దీని నుంచి 'హంగ్రీ చీతా' పేరుతో గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో మెుదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాన్ గుర్తుందా? అది మట్టి, చెట్లతోపాటు సగం ఊరిని ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుపాన్ కడగలేకపోయింది. అలాంటి వాడు తిరిగి వస్తున్నాడు అంటే'' అంటూ పవన్ ఎంట్రీ గురించి చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రచార చిత్రంలో పవన్ విశ్వరూపాన్ని చూపించాడు. శత్రువులను ఊచకోత కోస్తున్న సీన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. 


సాహో తర్వాత సుజిత్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. 1990ల నాటి ముంబయి మాఫియా బ్యాక్ డ్రాప్ లో మూవీ రూపొందుతోంది. ఇప్పటికే చాలా వరకు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో పవన్ జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయారెడ్డి తదితరుల కీ రోల్స్ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 


Also read: Sourav Ganguly Biopic: గంగూలీ రోల్ లో ఆయుష్మాన్‌.. త్వరలో సెట్స్ పైకి దాదా బయోపిక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి