UI The Movie Teaser : కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తూ దర్శకత్వం చేస్తున్న సినిమా 'యూఐ: ది మూవీ'. ఉప్పీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న యూఐ సినిమా టీజర్ ను వినాయక చవితి సందర్బంగా ఈరోజు సాయంత్రం  రిలీజ్ చేశారు మేకర్స్.  బెంగళూరులోని ఊర్వశి సినిమా వద్ద వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ మూవీ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో  శివరాజ్ కుమార్, గీతా శివరాజ్ కుమార్, దునియా విజయ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా..శివరాజ్ కుమార్ ఉప్పీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడిగా ఉపేంద్రను పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూఐ టీజర్‌లో ఎప్పటిలాగే తన క్రియేటివిటీని ఉపయోగించాడు ఉపేంద్ర. ఇందులో ఎలాంటి విజువల్స్ లేవు. కొన్ని  డైలాగ్స్, శబ్ధాలు మాత్రమే వినిపించాయి. మెుత్తం వీడియోలో వింత  వింత శబ్దాలతోపాటు ఉపేంద్ర బోల్డ్ వాయిస్ మాత్రమే ఉంది. 2 నిమిషాలు 17 సెకనల నిడివి గల ఈ టీజర్ ప్రస్తుతం ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కళ్లు మూసుకొని కూడా ఈ టీజర్ ను చూడొచ్చంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 


‘చీకటి.. అంతా చీకటి..’ అంటూ మొదలైన టీజర్‌లో కేవలం శబ్దాలు మాత్రమే వినిపించాయి. ‘ఇది ఏఐ వరల్డ్‌ కాదు. ఇది యూఐ వరల్డ్‌. దీని నుంచి తప్పించుకోవాలంటే, మీ తెలివితేటలను వాడండి' అంటూ సాగే ఈ టీజర్ మూవీపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.



Also Read: Varun Tej: వరుణ్ ఇంట్లో ఘనంగా గణపతి ఉత్సవాలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా కాబోయే కోడలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook