హేమ మాలిని, ప్రసూన్ జోషికి ‘`ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్` అవార్డు
బాలీవుడ్ నటి, రాజకీయవేత్త హేమమాలిని, సీబీఎఫ్సీ చైర్పర్సన్ ప్రసూన్ జోషిలు `ఇండియన్ పర్సనాలిటీస్ ఆఫ్ ది ఇయర్` అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం వెల్లడించారు.
Indian Film Personality of the Year: బాలీవుడ్ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలినికి(hema malini) అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డును కేంద్రం ప్రకటించింది.
నవంబరు 20 నుంచి 28 వరకు గోవా(Goa)లో జరగనున్న భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం(ఇఫి) వేడుక(IFFA 2021)లో ఆమెకు ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Union Minister Anurag Thakur) తెలిపారు. ఈమెతో పాటు సీబీఎఫ్సీ ఛైర్పర్సన్ ప్రసూన్ జోషి(CBFC chairperson Prasoon Joshi) కూడా ఈ అవార్డును ఇవ్వనున్నారు. కాగా గత సంవత్సరం ఈ అవార్డును ప్రముఖ నటుడు, దర్శకుడు బిస్వజిత్ ఛటర్జీకి ప్రదానం చేశారు .
Also Read: సరోగసి ద్వారా కవలలకు తల్లి అయిన బాలీవుడ్ నటి ప్రీతీ జింటా
ఈ చలన చిత్రోత్సవ వేడుకల్లో తొలిసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్(OTT Platforms) కూడా పాల్గొనబోతుండటం విశేషం. సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారాన్ని అమెరికన్ ఫిల్మ్‌మేకర్ మార్టిన్ స్కార్సిసి, హంగేరియన్ దర్శకుడు ఇస్త్వాన్ జాబోకు(Istvan Szabo) అందజేయనున్నట్లు ఠాకూర్ వెల్లడించారు. ఈ 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' 52వ ఎడిషన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గోవా ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook