Shobhan Babu Son : ఒకప్పుడు శోభన్ బాబుని టాలీవుడ్ అందగాడు అని పిలిచేవారు. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలిన హీరోలలో ఆయన కూడా ఒకరు. అప్పటి హీరోలతో పోటీపడి మరీ సినిమాలు చేసి తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు శోభన్ బాబు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో శోభన్ బాబుకి చాలామంది అభిమానులు ఉండేవారు. కుటుంబ నేపథ్యం ఉండే సినిమాలు చేసిన శోభన్ బాబు ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో ఇప్పటికీ తన లక్షలాది మంది అభిమానుల గుండెల్లో సజీవంగా ఉన్నారు. 


అంచెలంచెలుగా హీరోగా స్టార్ స్టేటస్ ను పెంచుకున్న శోభన్ బాబు తనయుడే కరుణ శేషు. అందరూ స్టార్ హీరోల కొడుకుల లాగానే కరుణ శేషు కూడా ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెడతారని, ఆయన కూడా కచ్చితంగా స్టార్ హీరో అవుతాడని అప్పట్లో చాలామంది అనుకున్నారు. కానీ కరుణ శేషు మాత్రం ఇండస్ట్రీలో అడుగుపెట్టలేదు.


శోభన్ బాబు కొడుకుని ఇండస్ట్రీలోకి రానివ్వకుండా ఒకరు అడ్డుపడ్డారు. అందుకే ఆయన సినిమాలకి దూరంగానే ఉండిపోయారు. సినిమాల వైపు చూడకుండా వ్యాపారాలు చేస్తూ సెటిల్ అయ్యారు. ఆయన ఇండస్ట్రీకి రాకుండా ఉండిపోవడానికి గల కారణం ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం అని తెలుస్తోంది.


ఇంతకీ ఆ నిర్ణయం తీసుకున్న వ్యక్తి మరెవరో కాదు శోభన్ బాబు. తన కొడుకు సినిమాల్లోకి రాకూడదని వ్యాపారంలో రాణించాలని శోభన్ బాబు కోరుకున్నారట. తండ్రి మాట జవదాటని కరుణ శేషు సినిమాలకి దూరంగానే ఉండిపోయారు. శోభన్ బాబు స్వయంగా కరుణ శేషుకి బిజినెస్ లో మెలుకువలు నేర్పించి మరీ వ్యాపారాలు చూసుకోమని చెప్పారట. అలా కరుణ శేషు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. ఇప్పటికీ కొందరు సినీ ప్రముఖులు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు.


Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌


 



 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook