Prabhas: గ్లోబల్ లెవల్లో ప్రభాస్ స్టార్ డమ్ కు ఇదే నిదర్శనం.. రెబల్ స్టారా మజాకా..
Prabhas: అవును బాహుబలి సినిమాతో ప్యాన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. గతేడాది ‘సలార్’ మూవీతో బ్యాక్ బౌన్స్ అయ్యాడు. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీతో హీరోగా తన స్టార్ డమ్ చూపిస్తున్నాడు. తాజాగా ప్రభాస్ కల్కి సినిమా చూడటానికి విదేశాల నుంచి కొంత మంది అభిమానులు హైదరాబాద్ కు రావడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
Prabhas: బాహుబలి సినిమాతో ప్రభాస్ లెవల్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్ కు పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ అసలు సిసలు గ్లోబల్ స్టార్ అని చెప్పాలి. ఆయన నటించని ప్రతి సినిమా సరిహద్దులు దాటి ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
తన చిత్రాలతో ఎల్లలు లేని అభిమానం సంపాదించుకుంటున్నారు ప్రభాస్. బాహుబలి నుంచి ఈ ఫినామినా స్టార్ట్ అయింది. సలార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు ‘కల్కి 2898ఎడి’ తో ప్రభాస్ మరోసారి లోకల్ టు గ్లోబల్ తన స్టార్ డమ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది.
కల్కి 2898 ఎడి సినిమా చూసేందుకు రీసెంట్ గా కొంత మంది జపాన్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీని చూశారు. మల్టీప్లెక్స్ ముందు ఉన్న బుజ్జి కారును, ప్రభాస్ కటౌట్ తో సెల్ఫీస్, ఫొటోస్ తీసుకోవడం విశేషం. . ఈ ఫొటోస్ ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తన ఇన్ స్టా అక్కౌంట్ లో షేర్ చేసింది. ‘కల్కి 2898 ఎడి’ సినిమా విజయం పట్ల జపాన్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభాస్ కొత్త సినిమా వచ్చిందంటే అది భారతీయ బాక్సాఫీస్ రికార్డులకు మరో చరిత్రను తిరగరాస్తోంది. బహుబలి, సలార్ తర్వాత కల్కి 2898ఎడి సినిమాతో తన థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ మూవీ దక్కించుకున్నారు ప్రభాస్. రెబెల్ స్టార్ చేస్తున్న భారీ లైనప్, ఆ సినిమాల్లో శ్రమతో, అంకితభావంతో, నటనా ప్రతిభతో తను ప్లే చేస్తోన్న క్యారెక్టర్స్, బ్యాక్ టు బ్యాక్ ఈ హ్యూజ్ మూవీస్ చేసేందుకు ఆయన పడుతున్న కష్టం మాములుగా లేదు. ఇవన్నీ ప్రభాస్ ను మరో స్టార్ అందుకో లేనంత ఎత్తులో నిలబెడుతున్నాయి. తెలుగు వారు కూడా రెబల్ స్టార్ డమ్ చూసి గర్విస్తున్నారు.
వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ సైన్ష్ ఫిక్షన్ పురాణాలను మిలితం చేసి తనదైన విజన్ తో కల్కి 2898ఎడి సిల్వర్ స్క్రీన్ మీద ఒక కొత్త ప్రపంచాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించాడు. ఈ కొత్త ప్రపంచం విఖ్యాత నటీనటులు, వివిధ రంగాల దిగ్గజాలతో పాటు సీ సెంటర్ లో కింద సీట్ లో కూర్చున్న ఓ సాధారణ ప్రేక్షకుడిని సైతం మైమరచి చూసేలా చేస్తోంది.
Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి