Hero chiyaan vikram danced with students of vvit students thangalaan promotion event: హీరో విక్రమ్ ఆంధ్ర ప్రదేశ్ లో హల్ చల్ చేశారు. తంగలాన్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా తొలుత విజయవాడకు వచ్చారు.అక్కడ ఫెమస్ అయిన బాబాయ్ హోటల్ కు వెళ్లి అక్కడ సందడి చేశారు. తమకు నచ్చిన టిఫిన్ ను టెస్ట్ చేశారు. బాబాయ్ హోటల్ సిబ్బంది.. సినిమా టీమ్ కు స్పెషల్ గా టిఫిన్లు, ఐటమ్స్ లను వాళ్ల ముందు ఉంచారు. ఈ క్రమంలో  హీరో విక్రమ్ తోపాటు.. మాళవిక మోహనన్, నిర్మాత జ్ఞానువేల్ రాజా అక్కడ టిఫిన్ ను ఎంజాయ్ చేశారు. అక్కడున్న విక్రమ్ అభిమానులు వారితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కాసేపు అక్కడున్న ప్రేక్షకులతో హీరో విక్రమ్ సరదాగా ముచ్చటించారు. చియాన్  విక్రమ్‌ హీరోగా నటించిన సరికొత్త  'తంగలాన్'.  దీనిలో మాళవిక మోహనన్‌  హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను పా. రంజిత్ తెరకెక్కించారు. ఆగస్టు 15 రోజు ఇండిపెండెన్స్  నేపథ్యంలో ఈ మూవీ విడుదల కానుంది. దీనిలో భాగంగా మూవీ టీమ్.. విజయవాడలో, గుంటూరులో హల్ చల్ చేశారు. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా.రంజిత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.


ఈ మూవీ చూస్తున్నంత సేపు మీకు.. మరో లోకంలో వెళ్లినట్లు ఉంటుందని కూడా మూవీ యూనీట్ ప్రమోషన్ లో పేర్కొన్నారు.  ఇదిలా ఉండగా.. హీరో విక్రమ్..  గుంటూరులోని వీవీఐటీ కాలేజీ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ లు చేస్తు హల్ చల్ చేశారు.


Read more: Smita Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ ట్విట్  వ్యవహారం.. ధర్మాసనం సీరియస్..  


అంతేకాకుండా.. అక్కడున్న విద్యార్థులు కూడా హీరో  విక్రమ్  చేస్తున్న డ్యాన్సు ను తమ విజిల్స్, చప్పట్లు కొడుతూ ఫుల్ గా ఎంకరేజ్ చేశారు. బ్లాక్ కలర్ డ్రెస్ లో హీరో విక్రమ్ డ్యాన్స్ చేస్తుంటే, అక్కడున్న స్టూడెంట్స్ సైతం పూనకాలతో రెచ్చిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తోంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter