Hero Chiyaan Vikram Intresting Comments on Boycott Trend: ప్రస్తుతానికి సినీ పరిశ్రమలో బాయ్ కాట్ ట్రెండ్ టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఈ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఏ పెద్ద సినిమా విడుదలవుతున్నా సరే ఎవరు బాయ్ కాట్ చేయమని పిలుపునిస్తారో అనే టెన్షన్లో దర్శకనిర్మాతలు, హీరోలు మునిగిపోతున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హిందీలో ఇటీవల విడుదలైన లాల్ సింగ్ చడ్డా అదే విధంగా అక్షయ్ కుమార్, రక్షాబంధన్ సినిమాలను బాయ్ కాట్ చేయమని బాలీవుడ్ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రాకపోవడంతో బాయ్ కాట్ ట్రెండ్ చేయాల్సిన అవసరం లేకుండానే సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఇటీవల విడుదలైన లైగర్ సినిమాని కూడా బాలీవుడ్ లో బాయ్ కాట్ చేయమని ఒక వర్గం పిలుపునిచ్చింది. అయితే హిందీలో తెలుగులో కంటే ఎక్కువ కలెక్షన్లు రావడం చూస్తుంటే లైగర్ మీద బాయికాట్ ట్రెండ్ ప్రభావం పడినట్లు కనిపించడం లేదు.


అయితే అమీర్ ఖాన్ సినిమాను తెలుగులో ప్రమోట్ చేసిన నేపథ్యంలో తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాని, నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమాని కూడా బాయ్ కాట్ చేయమని పిలుపునిస్తున్న నేపద్యంలో ఈ వ్యాఖ్యలపై హీరో విక్రమ్ ఆసక్తికరంగా స్పందించారు. తాజాగా విక్రమ్ కోబ్రా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకే కాకుండా తమిళ ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.


తెలుగులో ప్రమోషన్స్ చేస్తున్న సమయంలో ఒక విలేఖరి విక్రమ్ ను ఇదే ప్రశ్న అడిగారు. సినిమాలను బాయ్ కట్ చేయమని పిలుపునిస్తున్నారు కదా మీరు ఈ బాయ్ కాట్ ట్రెండ్ గురించి ఏమని స్పందిస్తారు? అని అడిగితే విక్రమ్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. బాయ్ కాట్ అనే విషయాన్ని గురించి ప్రస్తావించకుండానే నాకు బాయ్ తెలుసు గర్ల్ తెలుసు అలాగే కాట్ అనేది కూడా బాగా తెలుసు కానీ ఈ బాయ్ కాట్ అంటే ఏంటో తెలియదని తన బ్రెయిన్ అంతా కూడా కోబ్రా సినిమాతోనే నిండిపోయి ఉందని అన్నారు. కోబ్రా ప్రమోషన్స్ గురించే ప్రస్తుతం మాట్లాడదామని అని సదరు విలేఖరికి షాక్ ఇచ్చారు. 
Also Read: Andrea Jeremiah Nude Scene: సినిమాలో నగ్నంగా ఆండ్రియా.. అందుకే అన్ని కోట్లన్న డైరెక్టర్ మిస్కిన్


Also Read: Hero Vidyasagar Died: టాలీవుడ్ లో మరో విషాదం.. అనారోగ్యంతో హీరో మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి