Hero Nani launched Oka Chinna Family Story teaser A Funny Realistic Tale Of Middle Class Struggle: సంగీత్‌ శోభన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ (OTT platform) వేదికగా రిలీజ్ కానుంది. ఈ సిరీస్‌ ఫుల్‌ టైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందింది. నవంబర్‌ 19 నుంచి ప్రసారం కానున్న ఈ సిరీస్‌ టీజర్‌ని (Teaser‌) తాజాగా నటుడు నాని (Nani) రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్ స్టార్టింగ్‌లో ఇంటి పక్కన వాళ్ల నుంచి పండ్లు అమ్మేవారి వరకూ.. ఇలా ప్రతి ఒక్కరూ మహేశ్‌ (Mahesh) అని పిలుస్తూ కనిపిస్తారు.. ఇక నేనే మహేశ్‌.. మీకో స్టోరీ చెబుతా. ఇందులో ఓ అమ్మ, నాన్న, బామ్మ.. స్టోరీ ఇంతే అయితే బాగుండేది. కానీ మా నాన్న.. అందరికీ కలిపి ఓ పెద్ద గిఫ్ట్‌ ఇచ్చాడు అంటూ సంగీత్‌ శోభన్‌ ఎంట్రీ ఇస్తాడు. మధ్యతరగతి నిరుద్యోగిగా సంగీత్‌ శోభన్‌ (SangeethShobhan) పలికించిన హావభావాలు ఆకట్టుకుంటున్నాయి.



 


Also Read : New rules form November 1: నవంబర్​ 1 నుంచి భారీ మార్పులు- ఇప్పుడే ఈ విషయాలు తెలుసుకో


పింక్‌ ఎలిఫెంట్స్‌ పిక్చర్స్‌ పతాకంపై నిహారిక (Niharika) ఈ సిరీస్‌ని నిర్మించారు. ఓ మధ్యతరగతి నిరుద్యోగ యువకుడిపై అనుకోకుండా అప్పుల బాధలు పడితే.. వచ్చే సమస్యలు ఏమిటనే విషయాలతో ఈ సిరీస్‌ని (Series‌) రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో సిమ్రాన్‌ శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..అలనాటి నటి తులసీ, నరేశ్‌ (Naresh) కీలకపాత్రల్లో కనిపిస్తారు.


Also Read : COVID-19: ఆ దేశాల్లో కోవిడ్‌ కొత్త స్ట్రెయిన్‌ కల్లోలం, మనదేశంలో కాస్త తక్కువే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి