Hero Rajasekhar Latest News: పండగ రోజు సినీ నటుడు రాజశేఖర్ ఇంట విషాదం
Hero Rajasekhar Latest News: దీపావళి పండగ రోజున టాలీవుడ్ కథానాయకుడు రాజశేఖర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హీరో రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ అనారోగ్యంతో కన్నుముశారు.
Hero Rajasekhar Latest News: దీపావళి పండగ వేళ సినీ నటుడు రాజశేఖర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్ (93) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ, గురువారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
వరదరాజన్ గోపాల్ చెన్నై డీఎస్పీగా రిటైర్ అయ్యారు. ఆయనకు ఐదుగురు సంతానం కాగా ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వరదరాజన్ రెండో సంతానమే హీరో రాజశేఖర్. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు వరదరాజన్ భౌతిక కాయాన్ని చెన్నైకి తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలోనే జరగనున్నాయి.
రాజశేఖర్ ప్రస్తుతం శేఖర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇందులో రిటైర్డ్ పోలీస్ అధికారిగా రాజశేఖర్ కనిపించనున్నారు. మలయాళ సినిమా 'జోసెఫ్'కు ఇది రీమేక్! అను సితార, మస్కన్ కథానాయికలు. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: MEGA154 : నవంబరు 6న ‘మెగా 154’ నుంచి చిరంజీవి లుక్
Also Read: Akhanda Title Song Teaser: అదిరిపోయిన బాలకృష్ణ అఖండ టైటిల్ సాంగ్ టీజర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి