Sai dharam tej: ``అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది``..ఆలోచింపజేసేలా `రిపబ్లిక్` ట్రైలర్
Republic Trailer: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం రిపబ్లిక్. ఈ మూవీ ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు చిరంజీవి. ట్రైలర్ చూస్తుంటే సాయి తన విశ్వరూపం చూపించినట్లు తెలుస్తోంది.
Republic Trailer: మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రిపబ్లిక్’. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈసినిమాలో సాయితేజ్(Sai Dharam Tej) కలెక్టర్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh) కథానాయిక. అక్టోబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘రిపబ్లిక్’ ట్రైలర్(Republic Movie Trailer)ను బుధవారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) విడుదల చేశారు.
అవినీతి రాజకీయాల కారణంగా ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలియజేసేలా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో కలెక్టర్(Collector) పాత్రలో సాయి చెప్పే డైలాగ్‌లు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ‘సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలే బాహటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే.. కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్లకు కొమ్ము కాస్తున్నాయ్’ అంటూ సాయి చెప్పే డైలాగ్‌లు..''అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్'' అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ లు మెప్పించేలా ఉన్నాయి. ''దేనికి భయం, దేనికి భయం'' అంటూ చివరలో సాయి తేజ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ సినిమాపై హైప్ ను అమాంతం పెంచేసింది. మరోవైపు రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: Sequel Movies: సీక్వెల్‌కు సిద్ధమౌతున్న టాలీవుడ్ టాప్ హిట్ సినిమాలివే
మీ ప్రేమే సాయికు శ్రీ రామరక్ష
ఇటీవల రోడ్డు ప్రమాదాని(Road Accident)కి గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి స్పందించారు. ‘సాయిధరమ్ తేజ్ వేగంగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1వ విడుదల చేస్తే బాగుంటుందన్న సాయి తేజ్ కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతోంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయిధరమ్‌కు శ్రీరామ రక్ష’ అని చిరు పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook